మరింత తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
ABN , Publish Date - Apr 08 , 2026 | 06:23 AM
అంతర్జాతీయ భౌగోళిక కారణాల నేపథ్యంలో ఇటీవల హెచ్చుతగ్గులకు లోనైన బంగారం ధరలు కొద్ది రోజులుగా స్వల్పంగా తగ్గుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు (ఏప్రిల్ 8న) ఉదయం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం
గత కొద్ది రోజులుగా బంగారం ధరలు స్వల్ప తగ్గుదలను నమోదు చేస్తూ వస్తున్నాయి. అంతర్జాతీయ భౌగోళిక కారణాల నేపథ్యంలో ఇటీవల హెచ్చుతగ్గులకు లోనైన బంగారం ధరలు కొద్ది రోజులుగా స్వల్పంగా తగ్గుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం కూడా బంగారం ధరలు స్వల్ప తగ్గుదల నమోదు చేశాయి. (Gold prices).
ఈ రోజు (ఏప్రిల్ 8న) ఉదయం 6:00 గంటల సమయంలో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,49,830 దగ్గర ఉంది. ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,37,340 దగ్గర ఉంది (live gold rates). ఇక, దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ.1,49,980కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.1,37,490కి చేరుకుంది.
మరోవైపు వెండి ధర కూడా స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం 2.5 లక్షల రూపాయల చేరువలో కదలాడుతోంది. ఈ నేపథ్యంలో ఈ రోజు పలు నగరాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు (10 గ్రాములకు) (24 క్యారెట్, 22 క్యారెట్)
హైదరాబాద్‌లో రూ.1,49,830, రూ.1,37,340
విజయవాడలో రూ.1,49,830, రూ.1,37,340
ఢిల్లీలో రూ.1,49,980, రూ.1,37,490
ముంబైలో రూ.1,49,830, రూ.1,37,340
వడోదరలో రూ.1,49,880, రూ.1,37,390
కోల్‌కతాలో రూ.1,49,830, రూ.1,37,340
చెన్నైలో రూ.1,51,190, రూ.1,38,590
బెంగళూరులో రూ.1,49,830, రూ.1,37,340
కేరళలో రూ.1,49,830, రూ.1,37,340
పుణెలో రూ.1,49,830, రూ.1,37,340
ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కేజీకి)
హైదరాబాద్‌లో రూ.2,54,900
విజయవాడలో రూ.2,54,900
ఢిల్లీలో రూ.2,49,900
చెన్నైలో రూ.2,54,900
కోల్‌కతాలో రూ.2,49,900
కేరళలో రూ.2,54,900
ముంబైలో రూ.2,49,900
బెంగళూరులో రూ.2,49,900
వడోదరలో రూ.2,49,900
అహ్మదాబాద్‌లో రూ.2,49,900
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.
ఇవి కూడా చదవండి..
నేటి రాత్రి ఒక నాగరికత అంతమైపోతుంది: ట్రంప్
నాగరికతను అంతం చేస్తామన్న ట్రంప్.. గట్టి వార్నింగ్ ఇచ్చిన ఇరాన్