నేటి రాత్రి ఒక నాగరికత అంతమైపోతుంది: ట్రంప్
ABN , Publish Date - Apr 07 , 2026 | 06:15 PM
ఇరాన్‌కు ట్రంప్ భయానక వార్నింగ్ ఇచ్చారు. నేటి రాత్రి ఒక నాగరికత అంతమైపోవచ్చని సంచలన కామెంట్ చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: మరికొన్ని గంటల్లో ఇరాన్‌కు విధించిన డెడ్‌లైన్ ముగియనున్న నేపథ్యంలో యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మునుపెన్నడూ చూడని స్థాయిలో వార్నింగ్ ఇచ్చారు. ఈ రాత్రి ఒక నాగరితక అంతమైపోవచ్చంటూ తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో సంచలన కామెంట్ చేశారు. ‘నేటి రాత్రి ఒక నాగరికత మొత్తం అంతమైపోతుంది. ఇక మరెన్నడూ అది కనిపించదు. ఇలా జరగాలని నేను కోరుకోవట్లేదు. కానీ ఇది జరగక తప్పేలా లేదు’ అంటూ పోస్టు పెట్టారు.
తదుపరి జరిగేదేంటో చెప్పలేమని కూడా తన పోస్టులో నర్మగర్భంగా రాసుకొచ్చారు. ఇరాన్‌లో ఇప్పటికే పాలన మారింది కాబట్టి పాలకుల నుంచి మంచి నిర్ణయాలు రావొచ్చని కూడా పేర్కొన్నారు. ‘అసలు ఏం జరగనుందో ఈ రాత్రి తేలిపోతుంది. సంక్లిష్టమైన, సుదీర్ఘమైన ప్రపంచ చరిత్రలో ఇవి అత్యంత ముఖ్యమైన క్షణాలు. 47 ఏళ్ల వేధింపులు, అవినీతి, మరణాలు నేటితో ముగుస్తాయి. ఇరాన్ ప్రజలకు ఆ దేవుడు అండగా ఉండాలి’ అని ట్రంప్ తన పోస్టులో రాసుకొచ్చారు. దీంతో, ట్రంప్ ఏ నిర్ణయం తీసుకోబోతున్నారో తెలియక సర్వత్రా కలకలం రేగుతోంది.