Share News

ఇరాన్‌కు మరో రెండు వారాల గడువు.. డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం..

ABN , Publish Date - Apr 08 , 2026 | 06:07 AM

అమెరికా, ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హోర్ముజ్ జలసంధిని తెరిచేందుకు ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో రెండు వారాల గడువు ఇచ్చారు.

ఇరాన్‌కు మరో రెండు వారాల గడువు.. డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం..
Trump Iran ceasefire

అమెరికా, ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హోర్ముజ్ జలసంధిని తెరిచేందుకు ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో రెండు వారాల గడువు ఇచ్చారు. ఇరాన్‌పై దాడులను తాత్కాలికంగా రెండు వారాల పాటు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సమయంలో శాంతి చర్చలు కూడా జరగనున్నాయి. ఇరాన్ కూడా ఈ తాత్కాలిక ఒప్పందానికి అంగీకరించినట్లు ట్రంప్ పేర్కొన్నారు (Trump Iran ceasefire).


ఇరాన్‌కు ఇచ్చిన గడువును పొడిగించాలనే పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రతిపాదనను అంగీకరించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు 'ట్రూత్' ద్వారా ట్రంప్ వెల్లడించారు. 'పాక్ ప్రధాని షరీఫ్, ఫీల్డ్ మార్షల్ మునీర్‌తో మాట్లాడాను. ఇరాన్‌కు ఇచ్చిన గడువును పొడిగించాలని, దాడులను నిలిపి వేయాలని కోరారు. హోర్ముజ్ జలసంధిని తెరవాలనే షరుతుకు లోబడి రెండు వారాల గడువుకు, కాల్పుల విరమణకు అంగీకరించాను. ఇరు దేశాల వైపు నుంచి ఈ కాల్పుల విరమణ ఉంటుంది' అని ట్రంప్ పేర్కొన్నారు (US Iran war news).


ఇరాన్ పది సూత్రాలతో ఓ ప్రతిపాదనను పంపించిందని, అవన్నీ సానుకూలంగానే ఉన్నాయని ట్రంప్ పేర్కొనడం గమనార్హం (2 week ceasefire Iran). ఈ రెండు వారాల సమయంలో ఇరాన్‌తో శాంతి చర్చలు కూడా జరుగుతాయని చెప్పారు. ఇరాన్‌తో శాశ్వాత ఒప్పందానికి, పశ్చిమాసియాలో ప్రశాంతతను నెలకొల్పడానికి ఈ రెండు వారాల గడువు ఉపయోగపడుతుందని ట్రంప్ పేర్కొన్నారు. దీర్ఘకాలిక సమస్యకు పరిష్కారం త్వరలోనే దొరకబోతోందని ఆశాభావం వ్యక్తం చేశారు.


ఇవి కూడా చదవండి..

నేటి రాత్రి ఒక నాగరికత అంతమైపోతుంది: ట్రంప్

నాగరికతను అంతం చేస్తామన్న ట్రంప్.. గట్టి వార్నింగ్ ఇచ్చిన ఇరాన్

Updated Date - Apr 08 , 2026 | 06:24 AM