Share News

పతాకస్థాయికి ఉద్రిక్తతలు.. ఖర్గ్ ఐలాండ్‌పై మళ్లీ బాంబుల వర్షం..

ABN , Publish Date - Apr 07 , 2026 | 08:25 PM

హోర్ముజ్ జలసంధిని పూర్తిగా తెరిచేందుకు అమెరికా అధ్యక్షుడు మంగళవారం రాత్రి 8 గంటల వరకూ ఇరాక్‌కు విధించిన గడువుతో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరుకుంటున్నాయి. ఇరాన్ ఆర్థిక కిరీటమైన ఖర్గ్ ఐలాండ్‌పై అమెరికా-ఇజ్రాయెల్ మరోసారి బాంబుల వర్షం కురిపించాయి.

పతాకస్థాయికి ఉద్రిక్తతలు.. ఖర్గ్ ఐలాండ్‌పై మళ్లీ బాంబుల వర్షం..
Kharg Island

టెహ్రాన్: హోర్ముజ్ జలసంధిని పూర్తిగా తెరిచేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మంగళవారం రాత్రి 8 గంటల వరకూ ఇరాక్‌కు విధించిన గడువుతో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఇరాన్ ఆర్థిక కిరీటమైన ఖర్గ్ ఐలాండ్‌పై అమెరికా-ఇజ్రాయెల్ మరోసారి బాంబుల వర్షం కురిపించాయి. గత మార్చిలోనూ ఖర్గ్‌ ఐలాండ్‌పై సంయుక్త బలగాలు దాడులు జరిపాయి.


పర్షియన్ గల్ఫ్‌లో ఇరాన్‌ తీరానికి సుమారు 30 కిలోమీటర్ల దూరంలోని చిన్న ద్వీపం ఖర్గ్. ఇరాన్ చమురు ఎగుమతుల్లో 90 శాతం ఇక్కడి నుంచి వస్తోంది. ఈ ద్వీపాన్ని స్వాధీనం చేసుకోవడం ద్వారా హోర్ముజ్ జలసంధిని తెరిచేలా ఇరాన్‌పై ఒత్తిడి పెంచేందుకు అమెరికా పట్టుదలగా ఉంది. భారీగా బలగాలను సమీప ప్రాంతంలో మోహరించడంతో పాటు భూతల దాడులకు కూడా దిగేందుకు సిద్ధమవుతోంది.


నేటి రాత్రితో..

ఇరాన్‌కు వార్నింగ్‌ల మీద వార్నింగ్‌లు ఇస్తున్న ట్రంప్ మునుపెన్నడూ ఇవ్వనంత స్థాయిలో ఇరాన్‌కు తాజాగా వార్నింగ్ ఇచ్చారు. నేటి రాత్రి ఒక నాగరికత మొత్తం అంతమైపోతుందని, ఇక కనిపించదని, అలా జరగాలని తాను అనుకోనప్పటికీ తప్పేలా లేదని 'ట్రూత్ సోషల్'లో సంచలన కామెంట్ చేశారు. 47 ఏళ్ల వేధింపులు, అవినీతి, మరణాలు నేటితో ముగుస్తాయన్నారు. దీనిపై ఇరాన్ అదే స్థాయిలో బదులిచ్చింది. సైకో హెచ్చరికలు ఖాతరు చేయమని చెప్పింది. అలెగ్జాండర్ తగలబెట్టినా, మంగోలులు దోచుకున్నా ఇరాన్ నాగరికత కాలపరీక్షకు నిలిచిందని, సైకో హెచ్చరికలతో నాగరికత అంతం కాదని పేర్కొంది.


ఇవి కూడా చదవండి..

నేటి రాత్రి ఒక నాగరికత అంతమైపోతుంది: ట్రంప్

నాగరికతను అంతం చేస్తామన్న ట్రంప్.. గట్టి వార్నింగ్ ఇచ్చిన ఇరాన్

Updated Date - Apr 07 , 2026 | 08:28 PM