పాకిస్తాన్ విమానంలో ఇలా ఉంటుందా.. ఈ వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..
ABN , Publish Date - Jan 24 , 2026 | 08:34 PM
ఓ ప్రయాణికుడు పాకిస్తాన్ విమానంలోని బిజినెస్ క్లాస్ సీటులో కూర్చున్నాడు. అయితే అక్కడి సీట్లు చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. సీటు కవర్ చిరిగిపోవడంతో ఆర్మ్‌రెస్ట్ విరగడంతో పాటూ లోపలి భాగాలు కూడా బయటికి కనిపిస్తున్నాయి. ఇలా..
పాకిస్తాన్‌కు సంబంధించిన ఎలాంటి వీడియో అయినా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటుంది. ప్రస్తుతం ఆ దేశ ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉందనడానికి అనేక వీడియోలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. గతంలో అక్కడి వారు ఆ దేశ పరిస్థితులను వివరిస్తూ వీడియోలు చేయడం చూశాం. తాజాగా, పాకిస్తాన్‌కు సంబంధించిన విమానం వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. విమానం ఎక్కిన ప్రయాణికుడు లోపలి దృశ్యాలు చూసి షాక్ అయ్యాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ ప్రయాణికుడు పాకిస్తాన్ విమానంలోని బిజినెస్ క్లాస్ సీటులో (Pakistan Airlines) కూర్చున్నాడు. అయితే అక్కడి సీట్లు చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. సీటు కవర్ చిరిగిపోవడంతో (Torn airplane seats) ఆర్మ్‌రెస్ట్ విరగడంతో పాటూ లోపలి భాగాలు కూడా బయటికి కనిపిస్తున్నాయి.
ఇలా ఆ విమానంలో సీట్లు మొత్తం అధ్వానంగా ఉన్నాయి. సీట్ల పరిస్థితే ఇలా ఉంటే ఇక విమానం బాడీ ఇంకెలా ఉంటుందో అని ఆ ప్రయాణికుడు భయాందోళన వ్యక్తం చేశాడు. బిజినెస్ క్లాస్‌లో ఇలా ఉంటే.. ఇక ఎకానమీ క్లాస్‌లో పరిస్థితి ఇంకెలా ఉంటుందో అంటూ మరికొంత మంది అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభానికి పరాకాష్ఠగా నిలుస్తోంది.
పాకిస్తాన్‌లో విమాన, రైల్వేలు తదితర ప్రజా సౌకర్యాల పరిస్థితి ఎలా ఉందో అనడానికి ఇది ఒక ఉదాహరణగా నిలుస్తోంది. ప్రస్తుతం ఈ విమానం వీడియో సోషల్ మీడియాలోని వివిధ వేదికల్లో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘వామ్మో.. పాకిస్తాన్‌లో ఇలా ఉంటుందా’.. అంటూ కొందరు, ‘ఈ విమానం గమ్యస్థానం చేరడం గగనమే’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
మందు కొడితే ఇలాగే ఉంటుందేమో.. సముద్రంలో చనిపోయిన తిమింగలంతో..
గేదెను చుట్టుముట్టిన సింహాల గుంపు.. ప్రాణం తీసే సమయంలో షాకింగ్ ట్విస్ట్..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..