Share News

ట్రాఫిక్‌ రోడ్లపై వడాపావ్‌లు అమ్ముతూ నెలకు రూ.80 వేలు

ABN , Publish Date - Oct 12 , 2026 | 06:04 PM

ట్రాఫిక్ జామ్‌లు సాధారణంగా మనందరికీ విసుగు పుట్టిస్తాయి. అత్యవసర పని మీదో, ఆఫీసుకో వెళ్లేటపుడు ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కుపోతే విసుక్కుంటాం. కానీ, అవే ట్రాఫిక్ జామ్‌లు ఆ యువకుడి జీవితాన్నే మార్చేశాయి. ఆ సమస్య నుంచి వచ్చిన ఐడియాతో ముంబైలోని ఆ యువకుడు పిజ్జా డెలివరీ బాయ్ నుంచి ఇప్పుడు తానే ఓ ఫుడ్ బిజినెస్ చేసే స్థాయికి ఎదిగాడు.

ట్రాఫిక్‌ రోడ్లపై వడాపావ్‌లు అమ్ముతూ నెలకు రూ.80 వేలు

ఇంటర్‌నెట్ డెస్క్: ట్రాఫిక్ జామ్‌లు సాధారణంగా మనందరికీ విసుగు పుట్టిస్తాయి. అత్యవసర పని మీదో, ఆఫీసుకో వెళ్లేటపుడు ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కుపోతే విసుక్కుంటాం. కానీ, అవే ట్రాఫిక్ జామ్‌లు ఆ యువకుడి జీవితాన్నే మార్చేశాయి. ఆ సమస్య నుంచి వచ్చిన ఐడియాతో ముంబైలోని ఆ యువకుడు పిజ్జా డెలివరీ బాయ్ నుంచి ఇప్పుడు తానే ఓ ఫుడ్ బిజినెస్ చేసే స్థాయికి ఎదిగాడు. గౌరవ్ లోంధే గతంలో పిజ్జా డెలివరీ బాయ్‌గా పనిచేసేవాడు. డెలివరీల సమయంలో ముంబైలో రోజూ ట్రాఫిక్‌లో ఇరుక్కునేవాడు. ఆ టైంలో అతనికి ఒక ఐడియా వచ్చింది. రోజూ కొన్ని వందల మంది వాహనదారులు ట్రాఫిక్‌లో ఇరుక్కుంటున్నారు. ఆ సమయంలో వారందరికీ వడాపావ్‌లు అమ్మి వ్యాపారం చేస్తే బాగా సంపాదించవచ్చని అనుకున్నాడు. తన కుమారుడి వ్యాపారం కోసం అతని తల్లి రంజన ఎన్నో ఏళ్లపాటు దాచిపెట్టుకున్న రూ.లక్షను గౌరవ్‌కు ఇచ్చింది. దాంతో గౌరవ్ కొద్ది రోజుల్లోనే వ్యాపారం ప్రారంభించాడు. రూ.20తో ఒక బాక్సులో వడాపావ్, చిన్న వాటర్ బాటిల్, టిష్యూ పేపర్ విక్రయించాలని అనుకున్నాడు.


మొదటి రోజు 50 వడాపావ్‌లు తయారుచేసి అమ్మకానికి పెట్టగా ఎవ్వరూ కొనలేదు. దీంతో గౌరవ్ తీవ్ర నిరాశ చెందాడు. మిగిలిపోయిన ఆ వడాపావ్‌లను ఉచితంగా పంచాడు. రెండో రోజూ అలాగే జరిగింది. అలా కొద్ది రోజులు గిరాకీ లేకుండా గడిచింది. అయితే, ఓ రోజు ఒక గంటలోనే వడాపావ్‌లన్నీ అమ్ముడుపోయాయి. కస్టమర్లు వడపావ్‌లు కొంటున్నారని, మరిన్ని తయారు చేయాలని గౌరవ్ తన ఇంట్లో వారికి కాల్ చేసి చెప్పాడు. ఆరోజు అతను 100కుపైగా వడాపావ్‌లు అమ్మాడు. తర్వాతి రోజు నుంచి మరింత మంది కస్టమర్లు కొనడం ప్రారంభించడంతో అతని వ్యాపారం మూడు పూవులు ఆరు కాయలుగా వర్ధిల్లింది. ఇప్పుడు నెలకు అతను రూ.80 వేల ఆదాయం సంపాదిస్తున్నాడు. ఖర్చులన్నీ పోను తనకు రూ.80 వేలు మిగులుతోందని చెప్పాడు. అంతేకాకుండా ఒక కియోస్క్‌ను అద్దెకు తీసుకుని 8 మంది బాయ్స్‌ను నియమించాడు. వారికి నెలకు రూ.6 వేల జీతం ఇస్తున్నాడు. కాగా.. గౌరవ్ బిజినెస్ ఐడియాను అతని తల్లి రంజనా మొదట ఒప్పుకోలేదని సమాచారం. నెలకు రూ.35 వేల జీతం ఇచ్చే ఉద్యోగం వదులుకొని వ్యాపారం ప్రారంభించవద్దని ఆమె తన కొడుకుకు చెప్పినట్టు తెలుస్తోంది. అయినా కూడా గౌరవ్ పట్టు వదలకుండా తల్లిని ఒప్పించి వ్యాపారం ప్రారంభించి విజయవంతం అయ్యాడు.


ఇవి కూడా చదవండి:

భారత్-శ్రీలంక మ్యాచ్ వేదిక మార్పుపై వార్తలు.. బీసీసీఐ క్లారిటీ

సంజు రాణిస్తుంటే వైభవ్‌కు ఎప్పుడు అవకాశం వస్తుంది?: అశ్విన్

అభిషేక్ శర్మ ప్రపంచ స్థాయి విధ్వంసకర ఓపెనర్‌గా మారాడు: దినేశ్ కార్తీక్

Updated Date - Oct 12 , 2026 | 06:27 PM