Share News

జ్ఞానేశ్ కుమార్ తొలగింపుపై కేరళం అసెంబ్లీ తీర్మానం

ABN , Publish Date - Oct 12 , 2026 | 05:12 PM

కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కోరుతూ కేరళం అసెంబ్లీ సోమవారం ఒక తీర్మానాన్ని పాస్ చేసింది. భారత ఎన్నికల సంఘంలో పారదర్శకత తీసుకురావడానికి చర్యలు తీసుకోవాలని కోరింది. ముఖ్యమంత్రి వీడీ సతీశన్ ప్రవేశపెట్టిన ఈ తీర్మానానికి అధికార కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్), ప్రతిపక్షం సీపీఎం నేతృత్వంలోని లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ (ఎల్డీఎఫ్) మద్దతు తెలిపాయి.

జ్ఞానేశ్ కుమార్ తొలగింపుపై కేరళం అసెంబ్లీ తీర్మానం

ఇంటర్‌నెట్ డెస్క్: కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కోరుతూ కేరళం అసెంబ్లీ సోమవారం ఒక తీర్మానాన్ని పాస్ చేసింది. భారత ఎన్నికల సంఘంలో పారదర్శకత తీసుకురావడానికి చర్యలు తీసుకోవాలని కోరింది. ముఖ్యమంత్రి వీడీ సతీశన్ ప్రవేశపెట్టిన ఈ తీర్మానానికి అధికార కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్), ప్రతిపక్షం సీపీఎం నేతృత్వంలోని లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ (ఎల్డీఎఫ్) మద్దతు తెలిపాయి. కాగా.. తీర్మానంలోని పలు అంశాలపై బీజేపీ అభ్యంతరం తెలిపింది. వాటికి సవరణ చేయాలని బీజేపీ నేతలు కోరగా వాటిని తిరస్కరించారు. ఇక సీఈసీపై వచ్చిన ఆరోపణలపై సభ ఆందోళన వ్యక్తం చేసింది. స్వేచ్ఛాయుత, పారదర్శక, నిష్పక్షపాత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలని, అలా నిర్వహించిన ఎన్నికలపైనే భారతదేశ ప్రజాస్వామ్యం మనుగడ సాగిస్తుందని సభ పేర్కొంది. 'భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) పారదర్శకతపై సందేహాలు వస్తున్న నేపథ్యంలో ఆ రాజ్యాంగబద్ధ వ్యవస్థ విశ్వసనీయతను పునరుద్ధరించడానికి సీఈసీని తొలగించాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా చర్యలు తీసుకోవాలి' అని తీర్మానం పేర్కొంది.


ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) ప్రక్రియలో లోపాలను పరిష్కరించాలని, అర్హులైన ఓటర్లందరికీ ఓటు హక్కును పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వం, ఈసీఐని సభ కోరింది. అలాగే, సీఈసీని తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించింది. సీఈసీ ఎంపికలో ప్రధాన మంత్రి, లోక్‌సభ ప్రతిపక్ష నేతతో పాటు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన ప్యానెల్‌‌ను ఏర్పాటు చేయాలని తీర్మానం పేర్కొంది. 'సరైన విధానాన్ని అనుసరించకుండానే ఓటరు జాబితా నుంచి కోట్ల మంది ఓటర్ల పేర్లను తొలగించినట్లు ఫిర్యాదులు వచ్చాయి. బడుగు బలహీనవర్గాలు, మైనారిటీలు, యువత, కార్మికుల ఓట్లను తొలగించడం ప్రజాస్వామ్య సూత్రాలను కాలరాయడమే. అలాగే, ఓటర్ల జాబితాను తయారు చేయడానికి ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ల అధికారాలను కూడా తగ్గించారని మీడియాలో కథనాలు వచ్చాయి. ఫామ్-6కు సవరణలు చేశారని, దీనిపై ఇద్దరు ఎన్నికల అధికారులు అభ్యంతరాలు వ్యక్తం చేశారని పత్రికలు ప్రచురించాయి' అని తీర్మానం వ్యాఖ్యానించింది.


ఈ వార్తలనూ చదవండి:

తిరువళ్లువర్‌కు కాషాయ రంగు.. బీజేపీపై టీవీకే సెటైర్లు..

హిట్ అండ్ రన్ కేసులో రూ.2 లక్షల పరిహారం.. పొందే మార్గమిదే!

Updated Date - Oct 12 , 2026 | 05:22 PM