జ్ఞానేశ్ కుమార్‌కు నిద్ర పట్టడం లేదు.. ఎన్నికల కమిషనర్‌పై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు..
ABN , Publish Date - Oct 12 , 2026 | 01:38 PM
దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాల నిరసనలు కొనసాగుతున్నాయి. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాల నిరసనలు కొనసాగుతున్నాయి. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై కేంద్ర ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ పోరాటం నుంచి వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు (Rahul Gandhi about Gyanesh Kumar).
'ఢిల్లీలో భయానక వాతావరణం సృష్టించారు. ఢిల్లీ రోడ్లపై 30 వేల మంది పోలీసులను మోహరించారు. జ్ఞానేష్‌ను ప్రధాని మోదీ ఎందుకు కాపాడుతున్నారు? ఆర్‌ఎస్‌ఎస్ వారికి ఉన్న స్వేచ్ఛ.. యువతకు ఎందుకు లేదు? జ్ఞానేష్‌కుమార్ చరిత్ర మాకు తెలుసు.. బయటపెడతాం. జ్ఞానేష్ కుమార్ భయంతో ఉన్నారు. ఆయన నిద్రపోలేకపోతున్నారు' అని రాహుల్ పేర్కొన్నారు (INDIA Bloc Protest).
'పోలీసులు కూడా ప్రతిపక్షాల నిరసన పట్ల సానుకూలంగానే ఉన్నారు (SIR Controversy). మీరు చేస్తున్నది సరైనదే అని కనీసం 50 శాతం మంది పోలీసులు మాకు చెప్పారు. జ్ఞానేష్ కుమార్ లాంటి దొంగను ఎందుకు కాపాడుతున్నాం? అని పోలీసులు కూడా బాధపడుతున్నారు. మేం ఎవరికీ భయపడం. వెనుదిరిగేది లేదు. దీనికి రోజులు, వారాలు, నెలలు లేదా సంవత్సరాలు పట్టినా మాకు ఫరవాలేదు' అని రాహుల్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
కాల్పుల విరమణ ప్రకటించిన ట్రంప్.. అయినా ఉక్రెయిన్‌పై రష్యా దాడి!
స్వల్పంగా తగ్గిన ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..