Share News

ఇప్పుడు న్యూజిలాండ్ పర్యటన అవసరమా.. బీసీసీఐ షెడ్యూలింగ్‌పై దిలీప్ వెంగ్‌సర్కార్ ఫైర్..

ABN , Publish Date - Oct 12 , 2026 | 12:37 PM

భారత క్రికెట్ నియంత్రణ మండలి రూపొందించిన క్రికెట్ షెడ్యూల్‌పై మాజీ క్రికెటర్ దిలీప్ వెంగ్‌సర్కార్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఇప్పుడు న్యూజిలాండ్ పర్యటన అవసరమా.. బీసీసీఐ షెడ్యూలింగ్‌పై దిలీప్ వెంగ్‌సర్కార్ ఫైర్..
Dilip Vengsarkar about Ranji Trophy

ఇంటర్నెట్ డెస్క్: భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) రూపొందించిన క్రికెట్ షెడ్యూల్‌పై మాజీ క్రికెటర్ దిలీప్ వెంగ్‌సర్కార్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దేశవాళీ క్రికెట్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన రంజీ ట్రోఫీ జరుగుతున్న సమయంలోనే ఇండియా-ఏ జట్టును న్యూజిలాండ్ పర్యటనకు పంపడాన్ని ఆయన తప్పుబట్టారు. ఈ నిర్ణయం వల్ల దేశవాళీ టోర్నీ ప్రాధాన్యం తగ్గిపోతుందని అభిప్రాయపడ్డారు. ఇలాంటి నిర్ణయాలు సమంజసం కాదని పేర్కొన్నారు (Dilip Vengsarkar on BCCI).


2026-27 రంజీ ట్రోఫీ సమయంలోనే ఇండియా-ఏ జట్టు న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనుంది. ధ్రువ్ జురెల్ నాయకత్వంలోని 15 మంది సభ్యుల జట్టు అక్టోబర్ 24 నుంచి నవంబర్ 7 వరకు న్యూజిలాండ్‌లో మూడు మ్యాచ్‌లు ఆడనుంది. లింకన్, క్రైస్ట్‌చర్చ్ వేదికలుగా ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. న్యూజిలాండ్‌తో భారత సీనియర్ జట్టు ఆడనున్న రెండు టెస్టుల సిరీస్‌కు ముందు అక్కడి పరిస్థితులకు అలవాటు పడేందుకు ఈ పర్యటనను ఏర్పాటు చేశారు (India A New Zealand Tour).


రంజీ ట్రోఫీ వంటి కీలక దేశవాళీ టోర్నీ జరుగుతున్న సమయంలోనే ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఇండియా-ఏ తరఫున విదేశాల్లో ఆడటంపై వెంగ్‌సర్కార్ అభ్యంతరం వ్యక్తం చేశారు (Ranji Trophy 2026-27). ఇలాంటి చర్యల వల్ల రంజీ ట్రోఫీకి ఉండే ప్రాధాన్యం తగ్గిపోతుందని అన్నారు. జూనియర్ ఆటగాళ్లకు సీనియర్ల నుంచి నేర్చుకునే వెసులుబాటు ఉండదని అభిప్రాయపడ్డారు. దేశవాళీ టోర్నీలకు ఉన్న ప్రాధాన్యాన్ని కాపాడుతూ, అంతర్జాతీయ పర్యటనలకు తగిన సన్నాహాలు చేసుకునేలా షెడ్యూల్ రూపొందించాలని వెంగ్‌సర్కార్ సూచించారు.


ఇవి కూడా చదవండి..

కాల్పుల విరమణ ప్రకటించిన ట్రంప్.. అయినా ఉక్రెయిన్‌పై రష్యా దాడి!


స్వల్పంగా తగ్గిన ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Oct 12 , 2026 | 12:39 PM