హిట్ అండ్ రన్ కేసులో రూ.2 లక్షల పరిహారం.. పొందే మార్గమిదే!
ABN , Publish Date - Oct 12 , 2026 | 10:45 AM
హిట్ అండ్ రన్ కేసుల్లో బాధితులు మృతి చెందితే అతడు/ఆమె కుటుంబానికి రూ.2 లక్షల పరిహారాన్ని కేంద్రం చెల్లిస్తోంది. అలాగే క్షతగాత్రులకు రూ.50 వేలు ఇస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: హిట్ అండ్ రన్ కేసుల్లో బాధితులను ఆదుకునేందుకు కేంద్రం నష్ట పరిహారం అందజేస్తోంది. ఇలాంటి కేసుల్లో బాధితులు మృతి చెందితే అతడు/ఆమె కుటుంబానికి రూ.2 లక్షల పరిహారం చెల్లిస్తోంది. అలాగే హిట్ అండ్ రన్ కేసులో క్షతగాత్రులకు రూ.50 వేలు ఇస్తోంది. అయితే దీని కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలుసా?
దరఖాస్తు చేసుకునే విధానం..
కేంద్రం ఈ పరిహారాన్ని హిట్ అండ్ రన్ మోటార్ యాక్సిడెంట్స్ పథకం కింద అందిస్తోంది. ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే జిల్లా కలెక్టర్‌కు ఫారం-1 సమర్పించాలి. ఇందులో వ్యక్తిగత సమాచారం, ప్రమాదం జరిగిన స్థలం, సమయం, తీరు, గాయాల తీవ్రత వివరాలు నమోదు చేయాలి. ఈ ఫారం-1కు ప్రమాదానికి సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీ, బాధితుడి ఆధార్ కార్డ్, బ్యాంక్ పాస్‌బుక్ జిరాక్స్‌లను జతచేయాలి. బాధితుడు ప్రమాదంలో మృతి చెందితే.. మరణ ధ్రువీకరణ పత్రం, నామినీ బ్యాంక్ ఖాతా సమర్పించాలి. హిట్ అండ్ రన్ కేసుల్లో క్షతగాత్రులు ఫారం-4 ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఈ ఫారం-4కు వైద్య చికిత్సకు సంబంధించిన బిల్లులను జత చేయాలి.
అయితే ఈ పరిహారం అందాలంటే ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించే అవకాశం లేదని పోలీసులు అధికారులకు నివేదిక ఇవ్వాలి. అన్నీ పరిశీలించిన అధికారులు బాధితులకు పరిహారాన్ని అందిస్తారు.
ఈ వార్తలూ చదవండి
రైలులోనే మీ వస్తువులు మర్చిపోయారా.. తిరిగి పొందే మార్గం ఇదే..!
చాలా కాలంగా ట్రాఫిక్ చలాన్లు కట్టడం లేదా..? అయితే జాగ్రత్త