ఏపీటీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పాండురంగ
ABN , Publish Date - Oct 12 , 2026 | 05:26 AM
కృష్ణా, గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ శాసన మండలి అభ్యర్థిగా పి.పాండురంగ వరప్రసాద్‌ను ఎంపిక చేసినట్లు ఏపీటీఎఫ్ ప్రకటించింది.
అమరావతి, అక్టోబరు 11(ఆంధ్రజ్యోతి): కృష్ణా, గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ శాసన మండలి అభ్యర్థిగా పి.పాండురంగ వరప్రసాద్‌ను ఎంపిక చేసినట్లు ఏపీటీఎఫ్ ప్రకటించింది. ఆదివారం విజయవాడలో జరిగిన ఏపీటీఎఫ్ రాష్ట్ర సబ్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉపాధ్యాయ సమస్యలపై పాండురంగ నాలుగు దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నారని ఏపీటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చెన్నుపాటి మంజుల, కె.బసవలింగారావు అన్నారు.
ఈ వార్తలనూ చదవండి...
నెల్లూరులో ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు
రాయలసీమ అభివృద్ధి సభలో రాజకీయాలు వద్దు: పవన్ కల్యాణ్