భారత్-శ్రీలంక మ్యాచ్ వేదిక మార్పుపై వార్తలు.. బీసీసీఐ క్లారిటీ
ABN , Publish Date - Oct 12 , 2026 | 04:57 PM
భారత్-శ్రీలంక వన్డే మ్యాచ్ వేదిక మార్పుపై వస్తోన్న వార్తలను బీసీసీఐ ఖండించింది. డిసెంబర్ 13న ఢిల్లీలో జరగాల్సిన తొలి వన్డేను అహ్మదాబాద్‌కు మార్చనున్నట్లు కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.
ఇంటర్నెట్ డెస్క్: భారత్-శ్రీలంక వన్డే మ్యాచ్ వేదిక మార్పుపై వస్తోన్న వార్తలను బీసీసీఐ ఖండించింది. డిసెంబర్ 13న ఢిల్లీలో జరగాల్సిన తొలి వన్డేను అహ్మదాబాద్‌కు మార్చనున్నట్లు కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. వీటిల్లో ఎలాంటి నిజం లేదని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పష్టం చేశారు. అరుణ్ జైట్లీ స్టేడియంలో నిర్మాణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో మ్యాచ్‌ను మరో వేదికకు తరలించనున్నట్లు ప్రచారం జరుగుతున్నా.. ఇప్పటి వరకు అలాంటి నిర్ణయమేదీ తీసుకోలేదని వెల్లడించారు.
‘భారత్-శ్రీలంక వన్డే మ్యాచ్‌ను ఢిల్లీ నుంచి అహ్మదాబాద్‌కు మారుస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదు. మ్యాచ్ షెడ్యూల్‌లో మార్పుపై బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. షెడ్యూల్‌కు సంబంధించి తాజా సమాచారం కోసం మీడియా ప్రతినిధులు, అభిమానులు అధికారిక ప్రకటనలను మాత్రమే పరిగణనలోకి తీసుకోండి. ద్వైపాక్షిక సిరీస్‌ల్లో మ్యాచ్‌ల వేదికలను బీసీసీఐ నిర్దేశిత విధానం ప్రకారమే కేటాయిస్తుంది’ అని సైకియా స్పష్టం చేశారు.
శ్రీలంక జట్టు 2026 డిసెంబర్ 13 నుంచి 27 వరకు భారత పర్యటనకు రానుంది. ఈ పర్యటనలో మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలుత వన్డే సిరీస్ జరగనుండగా.. అనంతరం టీ20 సిరీస్ నిర్వహించనున్నారు. వన్డే సిరీస్ షెడ్యూల్ ప్రకారం తొలి మ్యాచ్ ఢిల్లీలో డిసెంబర్ 13న జరగనుంది. రెండో వన్డేకు బెంగళూరు, మూడో వన్డేకు అహ్మదాబాద్ ఆతిథ్యం ఇవ్వనున్నాయి. డిసెంబర్ 19న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో చివరి వన్డే జరగనుంది. వన్డే సిరీస్ ముగిసిన తర్వాత భారత్-శ్రీలంక జట్లు మూడు టీ20ల్లో తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లకు రాజ్‌కోట్, కటక్, పుణె వేదికలు కానున్నాయి.
ఇవి కూడా చదవండి:
అభిషేక్ శర్మ ప్రపంచ స్థాయి విధ్వంసకర ఓపెనర్‌గా మారాడు: దినేశ్ కార్తీక్
రంజీ ట్రోఫీకి అన్యాయం జరుగుతోంది.. బీసీసీఐపై గావస్కర్ అసంతృప్తి