టెస్టుల్లో ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ అరుదైన రికార్డు..
ABN , Publish Date - Oct 12 , 2026 | 03:03 PM
డర్బన్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ చరిత్ర సృష్టించాడు.
డర్బన్ వేదికగా దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ఇవాళ నాల్గవ రోజు ఆట ప్రారంభమైంది. మరోవైపు ఈ టెస్టులో ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ అరుదైన రికార్డును చేశాడు. టెస్టు ఫార్మాట్ లో 21వ శాతాబ్ధంలో ఒక్క సిక్సర్ కూడా ఇవ్వకుండా ఎక్కువ బంతులు వేసిన బౌలర్ గా చరిత్ర సృష్టించాడు. గతంలోనూ ఈ రికార్డు అతడి పేరు మీదనే ఉండగా.. తాజాగా సౌతాఫ్రికాతో జరుగుతోన్న టెస్టులోనూ ఆ రికార్డును స్టార్క్ కొనసాగిస్తున్నాడు.
ఇప్పటివరకు మిచెల్ స్టార్క్ 5,495 బంతుల వేసి... ఒక్క సిక్సర్ కూడా ఇవ్వకుండా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇక రెండో స్థానంలో ఇంగ్లాండ్ దిగ్గజ బౌలర్ జేమ్స్ అండర్సన్ ఉన్నాడు. అతడు 4,688 బంతుల్లో ఒక్క సిక్సర్ కూడా ఇవ్వలేదు. స్టార్క్, అండర్సన్ మధ్య దాదాపు వంద బంతుల వ్యత్యాస ఉంది. టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా 4,478 బంతులతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇంగ్లండ్ మాజీ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ 4,302 బంతులతో 4వ, న్యూజిలాండ్ మాజీ పేసర్ కొలిన్ డి గ్రాండ్‌హోమ్ 4,054 బంతులతో ఐదు స్థానాల్లో నిలిచాడు.
ఇక మ్యాచ్ విషయానికి నాలుగు రోజు ఆట ప్రారంభంకాగా.. ఆస్ట్రేలియా తమ రెండో ఇన్నింగ్స్‌లో 26 ఓవర్లు ముగిసే సరికి 3 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. లబుషేన్ (33), మాట్ రెన్‍షా (10) పరుగులతో క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం ఆసీస్ 193 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. ఇక ఆసీస్ బౌలర్ల ధాటికి సౌతాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్‌లో 284 పరుగులకు ఆలౌటైంది. అంతకముందు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 390 పరుగులకు ఆలౌటైంది.
ఇవి కూడా చదవండి:
రంజీ ట్రోఫీకి అన్యాయం జరుగుతోంది.. బీసీసీఐపై గావస్కర్ అసంతృప్తి
టెస్టుల్లో చరిత్ర సృష్టించిన స్టీవ్ స్మిత్.. జో రూట్ రికార్డు బద్దలు