Share News

టెస్టుల్లో చరిత్ర సృష్టించిన స్టీవ్ స్మిత్.. జో రూట్ రికార్డు బద్దలు

ABN , Publish Date - Oct 11 , 2026 | 05:37 PM

ఆస్ట్రేలియా స్టార్‌ బ్యాటర్‌ స్టీవ్‌ స్మిత్‌ టెస్టు క్రికెట్‌లో అరుదైన ఘనత సాధించాడు. మైదానంలో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న ఫీల్డర్‌గా చరిత్ర సృష్టించాడు. ఇంగ్లండ్‌ ఆటగాడు జో రూట్‌ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు.

టెస్టుల్లో చరిత్ర సృష్టించిన స్టీవ్ స్మిత్.. జో రూట్ రికార్డు బద్దలు
Steve Smith

ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియా స్టార్‌ బ్యాటర్‌ స్టీవ్‌ స్మిత్‌ టెస్టు క్రికెట్‌లో అరుదైన ఘనత సాధించాడు. మైదానంలో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న ఫీల్డర్‌గా చరిత్ర సృష్టించాడు. ఇంగ్లండ్‌ ఆటగాడు జో రూట్‌ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. దక్షిణాఫ్రికాతో డర్బన్‌ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మూడో రోజు ఈ ఘనతను అందుకున్నాడు. ప్యాట్ కమిన్స్ బౌలింగ్‌లో ప్రొటీస్ బ్యాటర్‌ డేవిడ్‌ బెడింగ్‌హామ్‌ ఇచ్చిన క్యాచ్‌ను స్మిత్ అందుకోవడంతో అతడి ఖాతాలో 221 క్యాచ్‌లు చేరాయి. దీంతో రూట్‌ (220)ను వెనక్కి నెట్టాడు.


అత్యధిక క్యాచ్‌లు అందుకున్న ఫీల్డర్లు వీరే!

టెస్టు క్రికెట్‌లో ఫీల్డర్‌గా అత్యధిక క్యాచ్‌లు అందుకున్న ఆటగాళ్ల జాబితాలో స్మిత్‌ అగ్రస్థానానికి చేరాడు. ఈ జాబితాలో భారత్‌ దిగ్గజం రాహుల్‌ ద్రవిడ్‌ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.

  • 221 – స్టీవ్‌ స్మిత్‌ (ఆస్ట్రేలియా)

  • 220 – జో రూట్‌ (ఇంగ్లండ్‌)

  • 210 – రాహుల్‌ ద్రవిడ్‌ (భారత్‌)

  • 205 – మహేల జయవర్ధనే (శ్రీలంక)

  • 200 – జాక్వెస్‌ కలిస్‌ (దక్షిణాఫ్రికా)

  • 196 – రికీ పాంటింగ్‌ (ఆస్ట్రేలియా)


ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 390 పరుగులకు ఆలౌటైంది. మ్యాచ్ రెన్‌షా(190) చెలరేగి ఆడాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌతాఫ్రికా.. ఈ వార్త రాసే సమయానికి 8 వికెట్లు కోల్పోయి 203 పరుగులు చేసింది. క్రీజులో సిమోన్ హామర్(1*), కేశవ్ మహారాజ్(6*) ఉన్నారు. ఆసీస్ కంటే సౌతాఫ్రికా ఇంకా 186 పరుగుల వెనుకంజలో ఉంది.


ఇవి కూడా చదవండి:

యూనిసెఫ్ ఇండియా సెలబ్రిటీ సలహాదారుగా స్మృతి మంధాన

టెస్టుల్లో కోహ్లీ అరుదైన రికార్డు బద్దలు.. చరిత్ర సృష్టించిన ఆసీస్ బ్యాటర్

Updated Date - Oct 11 , 2026 | 05:38 PM