వైభవ్‌కు బౌలింగ్ చేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా: ఫెర్గూసన్
ABN , Publish Date - Oct 11 , 2026 | 04:41 PM
భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య అక్టోబర్ 22 నుంచి ఐదు టీ20ల సిరీస్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ లాకీ ఫెర్గూసన్ ప్రశంసల వర్షం కురిపించాడు.
ఇంటర్నెట్ డెస్క్: భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య అక్టోబర్ 22 నుంచి ఐదు టీ20ల సిరీస్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ లాకీ ఫెర్గూసన్ ప్రశంసల వర్షం కురిపించాడు. 15 ఏళ్ల వయసులోనే అద్భుత ప్రతిభ కనబరుస్తున్న వైభవ్.. అంతర్జాతీయ క్రికెట్‌లోకి రావడం ఆశ్చర్యం కలిగించే విషయమేమీ కాదన్నాడు. అతడు అసాధారణ ప్రతిభావంతుడని కొనియాడాడు. ఐపీఎల్‌లో వైభవ్‌తో ఆడిన అనుభవం ఉందని, రాబోయే టీ20 సిరీస్‌లో అతడికి బౌలింగ్ చేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని పేర్కొన్నాడు.
‘ఐపీఎల్‌లో వైభవ్ ఆటను నేను దగ్గర నుంచి చూశాను. అతడు అసాధారణ ప్రతిభ కలిగిన ప్లేయర్. 14 ఏళ్ల వయసులోనే ఐపీఎల్ అరంగేట్రం చేసి.. వరుసగా రెండు సీజన్లలో అద్భుత ప్రదర్శన చేశాడు. ఇలాంటి అసాధారణ ప్రతిభ ఉన్నప్పుడు భారత జట్టులో చోటు దక్కించుకోవడం పెద్దగా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. న్యూజిలాండ్ సిరీస్‌లో వైభవ్‌కు బౌలింగ్ వేయడానికి ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నా. మా దేశంలో వైభవ్‌కు ఇది తొలి పర్యటన కావొచ్చు. అక్కడి పరిస్థితులకు అతడు ఎలా అలవాటు పడతాడో చూడాలని ఉంది’ అని ఫెర్గూసన్ వెల్లడించాడు.
ఇవి కూడా చదవండి:
యూనిసెఫ్ ఇండియా సెలబ్రిటీ సలహాదారుగా స్మృతి మంధాన
టెస్టుల్లో కోహ్లీ అరుదైన రికార్డు బద్దలు.. చరిత్ర సృష్టించిన ఆసీస్ బ్యాటర్