హ్యాట్రిక్ తీసిన ఫాస్ట్ బౌలర్ హసన్ మహమూద్.. బంగ్లాదేశ్ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి..
ABN , Publish Date - Oct 11 , 2026 | 01:49 PM
అబుదాబిలో వేదికగా అఫ్గానిస్థాన్‌తో జరిగిన బంతితో చెలరేగిపోయిన బంగ్లాదేశ్ బౌలర్ మహమూద్ హసన్. ప్రత్యర్థి జట్టు లోయర్ ఆర్డర్‌ను కుప్పకూల్చాడు. హ్యాట్రిక్ వికెట్లు తీసుకోవడంతో పాటు మెయిడెన్ ఓవర్ వేసి బ్యాటర్లను ఉక్కిరిబిక్కిరి చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: బంగ్లాదేశ్ పేసర్ హసన్ మహమూద్(Hasan Mahmud) అద్భుత బౌలింగ్‌తో అదరగొట్టి రికార్డు సృష్టించాడు. ఆ దేశ చరిత్రలోనే టెస్ట్ మ్యాచ్‌లో హ్యాట్రిక్ సాధించిన తొలి ఫాస్ట్ బౌలర్‌గా నిలిచాడు. అబుదాబి వేదికగా అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో చెలరేగిపోయిన మహమూద్.. ప్రత్యర్థి జట్టు లోయర్ ఆర్డర్‌ను కుప్పకూల్చాడు. వరుసగా మూడు వికెట్లు తీసుకోవడంతో పాటు మెయిడెన్ ఓవర్ వేసి బ్యాటర్లను ఉక్కిరిబిక్కిరి చేశాడు. మొత్తంగా బంగ్లా నుంచి హ్యాట్రిక్ సాధించిన మూడో బౌలర్‌గా, తొలి ఫాస్ట్ బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు.
మొదట బ్యాటర్ ఇస్మత్ ఆలంను క్లీన్ బౌల్డ్ చేసి హసన్.. తరువాతి బంతికి కైస్ అహ్మద్ వికెట్ తీశాడు. ఆ తర్వాతి బంతికి జియాఉర్ రెహ్మాన్‌ను ఔట్ చేసి బంగ్లా క్రికెట్ చరిత్రలో హ్యాట్రిక్ సాధించిన తొలి పేసర్‌గా చోటు దక్కించుకున్నాడు. హసన్ సాధించిన ఈ ఫీట్‌తో.. కొంతకాలంగా బౌలింగ్ సామర్థ్యాలను పెంచుకునేందుకు బంగ్లాదేశ్ చేస్తున్న కృషిని స్పష్టం చేస్తోంది.
కాగా.. 2024లో హసన్ మహమూద్ బంగ్లాదేశ్ టెస్ట్ జట్టులోకి అరంగేట్రం చేశాడు. తన సీమ్ బౌలింగ్, లేట్ స్వింగ్‌తో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు. ఇప్పుడు టెస్ట్ హ్యాట్రిక్ సాధించడం ద్వారా క్రికెట్ దిగ్గజాల సరసన తన పేరును నమోదు చేసుకున్నాడు.
ఈ వార్తలూ చదవండి
బీసీసీఐకి గంభీర్ హెచ్చరిక.. పిచ్‌లు మారకపోతే భారత క్రికెట్‌కు నష్టమే!
ఆటగాళ్ల మార్పులే అసలు సమస్య.. గంభీర్‌పై సీఎస్కే మాజీ స్టార్ విమర్శలు