Share News

ఆటగాళ్ల మార్పులే అసలు సమస్య.. గంభీర్‌పై సీఎస్కే మాజీ స్టార్ విమర్శలు..

ABN , Publish Date - Oct 11 , 2026 | 12:31 PM

భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌పై ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్, చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ఆటగాడు షేన్ వాట్సన్ విమర్శలు చేశాడు.

ఆటగాళ్ల మార్పులే అసలు సమస్య.. గంభీర్‌పై సీఎస్కే మాజీ స్టార్ విమర్శలు..
Shane Watson, Gautam Gambhir

ఇంటర్నెట్ డెస్క్: భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌పై ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్, చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ఆటగాడు షేన్ వాట్సన్ విమర్శలు చేశాడు. తరచుగా ఆటగాళ్లను మార్చడం, బ్యాటింగ్ క్రమాన్ని పదేపదే మార్చడం వల్ల నిలకడైన ప్రదర్శన చేయలేకపోతున్నారని అభిప్రాయపడ్డాడు. ఆటగాళ్లకు తగినంత సమయం ఇవ్వడంతో పాటు జట్టులో మరింత స్థిరత్వం అవసరమని సూచించాడు (Shane Watson about Gautam Gambhir).


'భారత జట్టులో ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదవ లేదు. అయితే వారి సామర్థ్యానికి తగ్గట్టుగా జట్టు స్థిరంగా రాణించడం లేదు. గంభీర్ కోచింగ్‌లో తరచూ ఆటగాళ్లను మార్చడం, బ్యాటింగ్ స్థానాలను మార్చడం వల్ల ఆటగాళ్లు తమ పాత్రలకు అలవాటు పడటానికి ఇబ్బంది ఎదురవుతోంది. నిరంతరం జట్టులోకి రావడం, బయటకు వెళ్లడం లేదా బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పుల వల్ల ఆటగాళ్లు తమ సహజమైన ఆటతీరును ప్రదర్శించడం కష్టమవుతుంది' అని వాట్సాప్ పేర్కొన్నాడు (Team India performance).


భారత జట్టు ఏడాది పొడవునా క్రికెట్ ఆడుతుందని వాట్సన్ గుర్తుచేశాడు (Indian cricket news). ఆటగాళ్లపై పనిభారం తగ్గించేందుకు, వారు తాజాగా ఉండేందుకు మార్పులు చేయాల్సిన అవసరం ఉందని అంగీకరించాడు. అయితే, అవసరానికి మించి మార్పులు చేయడం కంటే ఒక స్థిరమైన జట్టును కొనసాగించడంపై దృష్టి పెట్టాలని సూచించాడు. కాగా, గంభీర్ కోచింగ్‌లో కొన్ని సానుకూలాంశాలను కూడా వాట్సాన్ ప్రశంసించాడు. సీనియర్ ఆటగాళ్లకు మద్దతుగా నిలవడం, సంజూ శాంసన్ వంటి ఆటగాళ్లకు అవకాశాలు కల్పించడం వంటి అంశాలను ప్రశంసించాడు.


ఇవి కూడా చదవండి..

చెన్నైకి నేడు ప్రధాని మోదీ.. రూ.13 వేల కోట్లకు పైగా అభివృద్ధి పనులకు శ్రీకారం..


ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే

Updated Date - Oct 11 , 2026 | 12:31 PM