Share News

చెన్నైకి నేడు ప్రధాని మోదీ.. రూ.13 వేల కోట్లకు పైగా అభివృద్ధి పనులకు శ్రీకారం..

ABN , Publish Date - Oct 11 , 2026 | 07:48 AM

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం (అక్టోబర్ 11) తమిళనాడు రాజధాని చెన్నైలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రూ.13 వేల కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు.

చెన్నైకి నేడు ప్రధాని మోదీ.. రూ.13 వేల కోట్లకు పైగా అభివృద్ధి పనులకు శ్రీకారం..
PM Modi Chennai visit

ఇంటర్నెట్ డెస్క్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం (అక్టోబర్ 11) తమిళనాడు రాజధాని చెన్నైలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రూ.13 వేల కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. అలాగే మరికొన్ని పనులకు శంకుస్థాపన చేయనున్నారు. మెట్రో రైలు, జాతీయ రహదారులు, రైల్వేలు, ఓడరేవులు, పెట్రోలియం, విద్యా రంగాలకు సంబంధించిన ప్రాజెక్టులు ఇందులో ఉన్నాయి (PM Modi Chennai visit).


మెట్రో రైలు రెండో దశలోని పూందమల్లి-వడపళని మార్గాన్ని ప్రధాని ప్రారంభించనున్నారు. సుమారు రూ.4,900 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ మార్గం నగరంలోని పశ్చిమ ప్రాంతాల నుంచి ఇతర ప్రధాన ప్రాంతాలకు ప్రయాణాన్ని సులభతరం చేయనుంది. ఈ మార్గంలో 3.7 కిలోమీటర్ల పొడవైన రెండు అంతస్తుల నిర్మాణం ప్రత్యేకతగా నిలుస్తోంది. ప్రధాని మోదీ ఉదయం సుమారు 11.30 గంటలకు పోరూర్ బైపాస్ స్టేషన్ నుంచి పూందమల్లి బైపాస్ స్టేషన్ వరకు మెట్రో రైలులో ప్రయాణించి తిరిగి రానున్నారు (Chennai Metro Phase 2).


అనంతరం జలకంఠేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు (Rs.13,000 crore projects). ఐఐటీ మద్రాస్‌లోని సుధా గోపాలకృష్ణన్ మెదడు పరిశోధనా కేంద్రాన్ని కూడా సందర్శించనున్నారు. తమిళనాడులో సుమారు రూ.3,700 కోట్ల విలువైన జాతీయ రహదారి ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించడంతో పాటు మరికొన్ని పనులకు శంకుస్థాపన చేయనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు చెన్నైలోని జైగోపాల్ గరోడియా హిందూ విద్యాలయ మెట్రిక్యులేషన్ ఉన్నత పాఠశాల స్వర్ణోత్సవ వేడుకల్లో పాల్గొననున్నారు.


ఇవి కూడా చదవండి..

భుజ్ భూకంపం.. నరేంద్ర మోదీ రాజకీయ జీవితాన్ని మలుపు తిప్పిన విపత్తు..


ఈ రోజు ఫోన్, టీవీ చూడొద్దని ముందే చెప్పాడు: అభిజిత్ దీప్కే తల్లి

Updated Date - Oct 11 , 2026 | 07:48 AM