Share News

ఢిల్లీలో ఉద్రిక్తత.. సుప్రీంకోర్టుకు ఇండియా కూటమి మార్చ్!

ABN , Publish Date - Oct 12 , 2026 | 05:16 PM

కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ,ప్రియాంక గాంధీ నేతృత్వంలో సుప్రీంకోర్టుకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఢిల్లీలో చోటుచేసుకున్న ఈ పరిణామాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

ఢిల్లీలో ఉద్రిక్తత.. సుప్రీంకోర్టుకు ఇండియా కూటమి మార్చ్!
Rahul Gandhi

ఢిల్లీ, అక్టోబర్ 12: కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా, 'ఓట్ల చోరీ' అంశంపై ఇవాళ(సోమవారం) సెంట్రల్ ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రతిపక్షాల ‘ఇండియా’ కూటమి ఆధ్వర్యంలో వేలాది మంది ప్రజలు, నేతలు కన్నాట్ ప్లేస్ నుంచి మండి హౌస్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. 'చలో ఢిల్లీ - మార్చ్ ఫర్ డెమోక్రసీ' పేరుతో చేపట్టిన ఈ మార్చ్ కారణంగా దేశ రాజధానిలో భద్రతను కట్టుదిట్టం చేశారు.


కన్నాట్ ప్లేస్-బరాఖంబా రోడ్ జంక్షన్ వద్ద ప్రతిపక్ష నేతలు పెద్ద ఎత్తున గుమిగూడి సుప్రీంకోర్టుకు బయలుదేరారు. ఈ నిరసన ప్రదర్శనలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పాల్గొన్నారు. ఎన్నికల సంఘం చీఫ్ జ్ఞానేష్ కుమార్ తన పదవికి వెంటనే రాజీనామా చేయాలంటూ ప్రతిపక్ష పార్టీల నేతలు గట్టిగా డిమాండ్ చేశారు.


ఈ ఎన్నికల సంఘం (ECI) తీరును తీవ్రంగా తప్పుబడుతూ విపక్షాలు తమ ఆందోళనను మరింత ఉధృతం చేశాయి. ఇప్పటికే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా (CJI)తో సంప్రదింపులు జరిపారు. అనంతరం ప్రధాన ఎన్నికల కమిషనర్‌పై తాము సిద్ధం చేసిన పిటిషన్‌ను సోమవారమే సుప్రీంకోర్టులో దాఖలు చేసినట్లు వారి తరఫు న్యాయ బృందం వెల్లడించింది. రాబోయే రోజుల్లో ఈ అంశంపై రాజకీయంగా ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


ఇవి కూడా చదవండి:

భారత్-శ్రీలంక మ్యాచ్ వేదిక మార్పుపై వార్తలు.. బీసీసీఐ క్లారిటీ

సంజు రాణిస్తుంటే వైభవ్‌కు ఎప్పుడు అవకాశం వస్తుంది?: అశ్విన్

అభిషేక్ శర్మ ప్రపంచ స్థాయి విధ్వంసకర ఓపెనర్‌గా మారాడు: దినేశ్ కార్తీక్

Updated Date - Oct 12 , 2026 | 05:57 PM