Share News

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ABN , First Publish Date - Feb 22 , 2026 | 07:15 AM

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
Breaking News

Live News & Updates

  • Feb 22, 2026 21:27 IST

    ట్రంప్ ఎస్టేట్‌లోకి చొరబడిన అగంతకుడి కాల్చివేత

    • ఫ్లోరిడా పామ్ బీచ్‌ ఎస్టేట్‌లోకి ప్రవేశించిన దుండగుడు

    • వెంటనే మట్టుబెట్టిన సీక్రెట్ సర్వీసు ఏజెంట్లు

    • దుండగుడి చేతిలో ఆయుధంతో పాటు ఇంధనం క్యాన్

  • Feb 22, 2026 21:22 IST

    ఏలూరు: నూజివీడులో రజకుల ఆత్మీయ మహాసభ

    • పాల్గొన్న మంత్రి పార్థసారథి

    • రజకుల అభివృద్ధికి ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయించింది

    • త్వరలో రజకులకు బ్యాంక్‌ రుణాలు: మంత్రి పార్థసారథి

  • Feb 22, 2026 21:02 IST

    మంచిర్యాల: క్యాతనపల్లిలో బాల్క సుమన్‌ నివాసంలో పోలీసుల సోదాలు

    • కంప్యూటర్‌ ఆపరేటర్‌ శ్రీనివాస్‌, మాజీ కౌన్సిలర్‌ ఓదెలు ఫోన్లు స్వాధీనం

    • అల్లర్ల కేసులో A11 దినేష్‌ను అదుపులోకి తీసుకున్న రామకృష్ణాపూర్‌ పోలీసులు

  • Feb 22, 2026 20:50 IST

    టీ20 WC గ్రూప్‌-8: భారత్‌ టార్గెట్‌ 188 పరుగులు

    • సౌతాఫ్రికా స్కోర్‌- 187/7

    • మిల్లర్‌ 63, బ్రెవిస్‌ 45, స్టబ్స్‌ 44 పరుగులు

    • బుమ్రా 3, అర్షదీప్ 2, దూబె, వరుణ్‌కు చెరో వికెట్‌

  • Feb 22, 2026 19:50 IST

    బాపట్ల ఎస్పీ ఉమామహేశ్వరరావుపై భూకబ్జా ఆరోపణలు

    • ఎస్పీ భూకబ్జా వివరాలు వెల్లడించిన బాపట్ల టీడీపీ నేత బాలకోటిరెడ్డి

    • తిరుపతి జిల్లా చిన్నగుట్ల మండలం దేవరపల్లిలో భూములు ఆక్రమించారు

    • బాపట్ల ఎస్పీపై ప్రభుత్వ పెద్దలు చర్యలు తీసుకోవాలి

  • Feb 22, 2026 19:49 IST

    నేను తొలిసారి సీఎం అయినప్పుడు BSNL మాత్రమే ఉంది: సీఎం చంద్రబాబు

    • అప్పట్లో బ్యాండ్‌విడ్త్ కోసం చాలా ఇబ్బందులు పడేవాళ్లం

    • 2 Mbps బ్యాండ్‌విడ్త్ కోసం ఎంతో కష్టపడ్డాం

    • అలా కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్‌లు నిర్వహించేవాళ్లం

    • భూ రికార్డులకు QR Code వల్ల అవకతవకలు ఉండవు

    • డిజిటల్ టెక్నాలజీ ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి రావాలి

  • Feb 22, 2026 19:31 IST

    ఎన్డీయే సీట్ల షేరింగ్ డీల్ పూర్తయింది: అస్సాం సీఎం హిమంత

    • భాగస్వామ్య పార్టీలతో డీల్ పూర్తి

    • సీట్లు, అభ్యర్థులు, పోటీ స్థానాలు ఖరారు

    • జాబితాతో అమిత్‌షాను కలుస్తాం

    • మార్చి-ఏప్రిల్‌లో అస్సాం అసెంబ్లీ ఎన్నికలు

  • Feb 22, 2026 19:25 IST

    సీఎం రేవంత్‌రెడ్డికి అరుదైన అంతర్జాతీయ ఆహ్వానం

    • అమెరికాలోని హార్వర్డ్ కెనడీ స్కూల్‌ నుంచి అధికారిక లేఖ

    • మార్చి 27న హార్వర్డ్ క్యాంపస్‌లో AI పాలసీ సింపోజియం

    • భారత్ నుంచి ఆహ్వానం పొందిన ఏకైక సీఎం రేవంత్‌రెడ్డి

    • డేటా సెంటర్లు, ఎనర్జీ సిస్టమ్స్, కంప్యూట్ కారిడార్స్‌పై చర్చ

    • తెలంగాణ AI సిటీ, AI ఎకోసిస్టమ్ విధానాలపై ప్రెజెంటేషన్

  • Feb 22, 2026 19:18 IST

    నిర్మల్: కడెం మండలం దోస్త్‌నగర్ దగ్గర ప్రమాదం

    • అదుపుతప్పి చెట్టును ఢీకొన్న కారు

    • ఒకరు మృతి, ఇద్దరికి తీవ్రగాయాలు

  • Feb 22, 2026 18:22 IST

    హైదరాబాద్: కాచిగూడ కృష్ణానగర్‌లో ఓ ఇంట్లో సిలిండర్ బ్లాస్ట్

    • ఇంట్లో ఎవరూ లేకపోవడంతో తప్పిన ప్రాణాపాయం

    • ఘటలా స్థలాన్ని పరిశీలించిన కాచిగూడ పోలీసులు, ఫైర్ సిబ్బంది

    • పేలుడు ధాటికి ముక్కలు ముక్కలైన ఇంటి పైకప్పు

  • Feb 22, 2026 17:49 IST

    మన టాలెంట్ బయటోళ్లు వాడుకుంటున్నారు: శామ్ పిట్రోడా

    • శామ్ పిటోడ్రా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు

    • ఇతర దేశాలకు సేవ చేసేందుకు భారత నైపుణ్యాలు దోహదం

    • సొంత ఆపరేటింగ్ సిస్టం లేకపోవడం సిగ్గుచేటు

    • పిట్రోడా వ్యాఖ్యలపై మండిపడిన బీజేపీ

  • Feb 22, 2026 17:40 IST

    జగన్‌పై మంత్రి నిమ్మల రామానాయుడు హాట్ కామెంట్స్

    • తిరుపతి లడ్డూలో రూ.240 కోట్ల కుంభకోణం

    • శ్రీవారి లడ్డూలో నెయ్యి బదులు రసాయనాలు కలిపారు

    • తిరుమలకు వెళ్లే అర్హత జగన్‌కి లేదు

    • హిందూ సమాజానికి జగన్ క్షమాపణ చెప్పాలి

    పూర్తికథనం

  • Feb 22, 2026 17:38 IST

    వెలుగులోకి ఆన్‌లైన్ షాపింగ్ మోసం

    • అమెజాన్‌లో కెమెరా ఆర్డర్ పెట్టిన కర్ణాటకలోని హుబ్బళ్లికి చెందిన వ్యక్తి

    • పార్సిల్‌లో కెమెరాకు బదులుగా రెండు సర్ఫ్ ప్యాకెట్లు

    పూర్తికథనం

  • Feb 22, 2026 16:59 IST

    ఢిల్లీలో అంతర్జాతీయ డ్రగ్స్‌ సిండికేట్‌ గుట్టురట్టు

    • 513 కిలోల డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్న పోలీసులు

  • Feb 22, 2026 16:59 IST

    ఉత్తరప్రదేశ్‌ మీరట్‌లో ప్రధాని మోదీ పర్యటన

    • మీరట్ మెట్రో ప్రారంభించిన ప్రధాని మోదీ

    • రూ.12,930 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభం

    • ప్రాజెక్టులను జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ

    • కాంగ్రెస్‌-ఎస్పీ పాలనలో అన్నీ స్కాములే

    • యోగీ పాలనలోనే యూపీ అభివృద్ధి

  • Feb 22, 2026 16:50 IST

    టీ20 WC గ్రూప్‌-8: శ్రీలంక టార్గెట్‌ 147 పరుగులు

    • ఇంగ్లండ్‌ స్కోర్‌- 146/9

    • ఫిలిప్‌ సాల్ట్‌ 62, విల్‌ జాక్స్‌ 21 పరుగులు

    • దునిత్‌ 3, దిల్షన్‌, తీక్షణ చెరో 2, చమీరకు 1 వికెట్‌

  • Feb 22, 2026 15:54 IST

    మహిళల ఆసియా కప్ ఫైనల్: బంగ్లా చిత్తు.. భారత్‌దే టైటిల్

    • బ్యాంకాక్ వేదికగా మహిళల ఆసియా కప్ రైజింగ్ స్టార్ 2026

    • ఫైనల్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై భారత మహిళల ఘన విజయం

  • Feb 22, 2026 15:54 IST

    హైదరాబాద్: జూబ్లీహిల్స్‌ రోడ్ నెం.45లో కారు బీభత్సం

    • మూడు వాహనాలపైకి దూసుకెళ్లిన ఫెరారీ కారు

  • Feb 22, 2026 15:24 IST

    తన కొడుకుకు రూ.4కోట్ల విలువైన గిఫ్ట్‌ ఇచ్చిన హార్దిక్ పాండ్య

    • తన కొడుకు అగస్త్యకు లగ్జరీ ల్యాండ్ రోవర్ కారును గిఫ్ట్‌గా ఇచ్చిన హార్దిక్ పాండ్య

    • ముంబైలో అగస్త్యకు కారు కీని అందించిన షోరూమ్ యాజమాన్యం

    • ఆ సమయంలో పక్కనే ఉన్న హార్దిక్ పాండ్య మాజీ భార్య నటాషా

  • Feb 22, 2026 15:22 IST

    బీఆర్ఎస్ తరహాలోనే కాంగ్రెస్‌ పాలన: బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి

    • నిన్నటినుంచి బీజేపీ నేతలను హౌస్‌ అరెస్టు చేస్తున్నారు

    • సీఎం రేవంత్‌కు పాలన చేతకావడం లేదు

    • హామీలు నెరవేర్చలేక డైవర్షన్‌ పాలిటిక్స్‌

    • తెలంగాణలో శాంతిభద్రతలు క్షీణించాయి

  • Feb 22, 2026 15:21 IST

    మహబూబ్‌బాద్‌: రెడ్యాల చేరుకున్న సీఎం రేవంత్‌రెడ్డి

    • ఇటీవల మృతిచెందిన కాంగ్రెస్‌ నేత రాఘవేందర్‌రెడ్డి కుటుంబానికి సీఎం రేవంత్‌ పరామర్శ

  • Feb 22, 2026 15:03 IST

    మెదక్‌: పెదశంకరంపేటలో ఉద్రిక్తత

    • రాజాసింగ్‌ అరెస్టుతో భజరంగ్‌దళ్‌ కార్యకర్తల ఆగ్రహం

    • ఆర్టీసీ బస్సు అద్దాలు పగులగొట్టి భజరంగ్‌దళ్‌ ఆందోళన

  • Feb 22, 2026 15:02 IST

    శరద్‌ పవార్‌కు మళ్లీ అస్వస్థత

    • డీహైడ్రేషన్‌తో పుణె ఆసుపత్రిలో చేరిక

    • ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పిన వైద్యులు

    • కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు

  • Feb 22, 2026 14:20 IST

    సూపర్- 8 'ప్రీ సీడింగ్' విధానంపై తొలిసారి స్పందించిన సూర్య

    • 'ప్రీ సీడింగ్' విధానం గురించి నాకు తెలియదు

    • ఈ విధానాన్ని ఎవరు చేస్తారో నాకు తెలియదు

    • వారి స్థానంలో నేను ఉంటే సర్దుబాటు చేస్తాను

  • Feb 22, 2026 13:49 IST

    పాక్ వైమానిక దాడులపై తాలిబాన్ల ఆగ్రహం

    • ఈ దాడుల్లో సామాన్య పౌరులు మరణించారని ఆరోపణ

    • జాతీయ సంస్థలు, ప్రార్థనా కేంద్రాలపై దాడులు పాక్ వైఫల్యానికి నిదర్శనమని కామెంట్

    • పొరుగుతో సఖ్యతగా ఉండాలన్న కనీస విలువను పాక్ పక్కనపెట్టిందని విమర్శ

    • తగిన సమయంలో దీటుగా బదులిస్తామని హెచ్చరిక

    పూర్తి కథనం

  • Feb 22, 2026 13:40 IST

    ఖమ్మం: బొగ్గుల శ్రీనివాస్ హత్యకేసులో వీడిన మిస్టరీ

    • ప్రధాన నిందితుడు వేణమాధవ్‌ సహా నలుగురు అరెస్ట్‌

    • నగదు విషయంలో శ్రీనివాస్, వేణుమాధవ్‌ మధ్య గొడవ

    • జీఎస్టీకి సంబంధించిన ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణం

    • డబ్బులు ఇస్తామని కారులో తీసుకెళ్లి హత్య చేసిన సుపారీ గ్యాంగ్‌

    • కారుతో సహా మృతదేహాన్ని పాలేరు రిజర్వాయర్‌లో పడేసిన నిందితులు

    • నిందితులు రిమాండ్‌కు తరలింపు: ఏసీపీ తిరుపతిరెడ్డి

  • Feb 22, 2026 13:15 IST

    మాజీ సీఎం జగన్‌పై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ధ్వజం

    • వైసీపీ అధినేత నీచ బుద్ధితో వ్యవహరిస్తున్నారని వ్యాఖ్య

    • జగన్‌కు, వైసీపీ నేతలకు హిందూమతం పట్ల విశ్వాసం లేదని విమర్శ

    • 300 ఆలయాలపై దాడులు జరిగినా ఒక్కసారీ ఖండించలేదని ధ్వజం

  • Feb 22, 2026 12:49 IST

    మహిళల విభాగంలో ముగ్గురు ప్లేయర్లు నామినేట్

    • 'ప్లేయర్ ఆఫ్ ది మంత్‌'కు నామినేట్ అయిన ఐర్లాండ్‌ ప్లేయర్ గాబీ లూయిస్‌

    • ఈ అవార్డు రేసులో ఉన్న బంగ్లాదేశ్‌ ప్లేయర్‌ శోభన మోస్టరీ

    • వీరితోపాటు నామినేట్ అయిన అమెరికా ప్లేయర్ టారా నోర్రిస్‌

  • Feb 22, 2026 12:49 IST

    సూర్యతోపాటు మరో ఇద్దరు ఎంపిక

    • 'ప్లేయర్ ఆఫ్ ది మంత్‌'కు నామినేట్ అయిన ఇంగ్లండ్ ప్లేయర్ జో రూట్

    • ఈ అవార్డు రేసులో ఉన్న న్యూజిలాండ్ బ్యాటర్ డారిమిచెల్

  • Feb 22, 2026 12:43 IST

    సూర్య కుమార్ యాదవ్‌కు గుడ్‌న్యూస్

    • టీమిండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్‌కు గుడ్‌న్యూస్

    • 'ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌' అవార్డుకు నామినేట్ అయిన సూర్య

    • 2026 జనవరి నెలకు నామినేట్ అయిన సూర్య

    పూర్తి కథనం

  • Feb 22, 2026 12:41 IST

    సీఐడీ మాజీ చీఫ్ పీవీ సునీల్ కుమార్‌కు షాక్

    • సీఐడీ మాజీ చీఫ్ పీవీ సునీల్ కుమార్‌ సస్పెన్షన్ పొడిగింపు

  • Feb 22, 2026 12:38 IST

    హైదరాబాద్: బండ్లగూడ క్రేయాన్స్ ఆస్పత్రిపై కేసు నమోదు

    • క్రేయాన్స్ ఆస్పత్రి మేనేజ్‌మెంట్‌ని అదుపులోకి తీసుకున్న పోలీసులు

    • చిన్నారి మృతి కేసులో దర్యాప్తు చేస్తున్న డ్రగ్ కంట్రోల్ బ్యూరో

    • ట్రీట్‌మెంట్ కోసం వాడిన 2 ఇంజెక్షన్లు సీజ్ చేసిన అధికారులు

    • ఇప్పటికే ఆస్పత్రిలో కాలం చెల్లిన ట్యాబ్లెట్స్, ఇంజెక్షన్లు సీజ్

    • పరారీలో శిశువుకు వైద్యం చేసిన డాక్టర్

    • ఉస్మానియా ఆస్పత్రిలో శిశువు మృతదేహం

  • Feb 22, 2026 12:37 IST

    MLA రాజాసింగ్‌ అరెస్ట్‌

    • మెదక్‌: బాన్సువాడ వెళ్తున్న MLA రాజాసింగ్‌ అరెస్ట్‌

    • పెద్దశంకరంపేట దగ్గర అదుపులోకి తీసుకున్న పోలీసులు

    పూర్తి కథనం

  • Feb 22, 2026 11:40 IST

    ఒడిశా: ఝార్సుగూడ జిల్లాలో తీవ్ర విషాదం

    • పోలీసుల బొలెరో వాహనాన్ని ఢీకొట్టిన ట్రక్కు

    • ఐదుగురి మృతి, ముగ్గురికి తీవ్రగాయాలు

    • అతివేగం ప్రమాదానికి కారణమని ప్రాథమిక అంచనా

    పూర్తి కథనం

  • Feb 22, 2026 11:25 IST

    హైదరాబాద్‌: తార్నాకలోని రాంచందర్‌రావు ఇంటి దగ్గర ఉద్రిక్తత

    • కామారెడ్డి వెళ్లేందుకు బయటకు వచ్చిన రాంచందర్‌రావు

    • ఉద్రిక్తత దృష్ట్యా కామారెడ్డికి వెళ్లేందుకు అనుమతి లేదన్న పోలీసులు

    • రాంచందర్‌రావును అడ్డుకున్న పోలీసులతో కార్యకర్తల వాగ్వాదం

    • ప్రభుత్వానికి వ్యతిరేకంగా BJP కార్యకర్తల నినాదాలు

    • పోలీసు ఆంక్షలపై రాంచందర్‌రావు ఆగ్రహం

    • రాంచందర్‌రావును అదుపులోకి తీసుకున్న పోలీసులు

    • పలువురు BJP కార్యకర్తలను అరెస్ట్‌ చేసిన పోలీసులు

  • Feb 22, 2026 10:45 IST

    టీ-20 ప్రపంచకప్ 2026 అప్డేట్స్

    • శ్రీలంకతో మ్యాచ్‌కు ముందు ఇంగ్లండ్‌కు బిగ్ షాక్

    • సూపర్-8లో నేడు తలపడనున్న శ్రీలంక, ఇంగ్లండ్ జట్లు

    • శ్రీలంకతో మ్యాచ్‌కు ముందు ఇంగ్లండ్‌కి గట్టి ఎదురుదెబ్బ

    • ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ జాకబ్ బేతెల్‌కు గాయం

    • శ్రీలంక మ్యాచ్‌లో బేతెల్ ఆటడంపై నెలకొన్న అనిశ్చితి

  • Feb 22, 2026 10:41 IST

    తమిళనాడులో ఉగ్ర కుట్ర భగ్నం

    • ఉగ్ర సంస్థలకు కంటెంట్ పోస్టు చేస్తున్న ఆరుగురు అరెస్ట్

    • నకిలీ ఆధార్‌తో తిరుప్పూర్ గార్మెంట్స్‌లో పని చేస్తున్న నిందితులు

    • నిందితుల నుంచి 8 ఫోన్లు, 16 సిమ్ కార్డులు స్వాధీనం

    • కంటెంట్ పోస్టులతోపాటు పేలుళ్ల కుట్రకు నిందితుల ప్లాన్

    పూర్తి కథనం

  • Feb 22, 2026 10:39 IST

    ఆపరేషన్‌ కగార్‌లో కీలక పరిణామం

    • లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత దేవ్‌జీ

    • తెలంగాణ SIB ఎదుట లొంగిపోయిన దేవ్‌జీ, మల్లా రాజిరెడ్డి

    • మావోయిస్టు కేంద్ర పార్టీ సెక్రటరీ జనరల్‌గా ఉన్న దేవ్‌జీ

    • దేవ్‌జీ అలియాస్‌ తిప్పిరి తిరుపతి స్వస్థలం పెద్దపల్లి

    • దేవ్‌జీతోపాటు లొంగిపోయిన పొలిట్‌బ్యూరో మెంబర్‌ మల్లా రాజిరెడ్డి

    • ఆసిఫాబాద్‌ అడవుల్లో లొంగిపోయిన మల్లా రాజిరెడ్డి

    • దేవ్‌జీతోపాటు లొంగిపోయిన 16 మంది మావోయిస్టులు

    పూర్తి కథనం

  • Feb 22, 2026 09:31 IST

    రేపటి నుంచి మార్చి 24 వరకూ ఏపీలో ఇంటర్‌ పరీక్షలు

    • ఏపీ వ్యాప్తంగా 1537 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు

    • పరీక్షలు రాయనున్న 10.57 లక్షల మంది విద్యార్థులు

    • గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచన

  • Feb 22, 2026 08:46 IST

    అఫ్గానిస్థాన్‌లో పాక్ వైమానిక దాడులు

    • పాక్ సరిహద్దుకు సమీపంలోని అఫ్గాన్ భూభాగాల్లో దాడులు

    • దాడుల్లో 17 మంది మరణించినట్టు అఫ్గానిస్థాన్ వెల్లడి

    • వైమానిక దాడులను ధ్రువీకరించిన పాక్ మంత్రి

    • ఉగ్ర మూకలే టార్గెట్‌గా దాడులు చేశామని ప్రకటన

    పూర్తి కథనం

  • Feb 22, 2026 08:22 IST

    తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు హౌస్ అరెస్ట్

    • కామారెడ్డిలో పర్యటన నేపథ్యంలో రాంచందర్‌రావు హౌస్ అరెస్ట్

    • కామారెడ్డి, బాన్సువాడలో నిన్న ఉద్రిక్తతలతో పర్యటనకు సిద్ధమైన రాంచందర్ రావు

    • ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి బాన్సువాడ, కామారెడ్డిలో పర్యటించాలని నిర్ణయం

    • ముందస్తు చర్యల్లో భాగంగా రాంచందర్‌రావును హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు

    • బాన్సువాడ, కామారెడ్డిలో కొనసాగుతున్న పోలీసు బందోబస్తు

    పూర్తి కథనం

  • Feb 22, 2026 08:07 IST

    హైదరాబాద్: రాజేంద్రనగర్‌లో మహ్మద్ అమీర్‌ దారుణ హత్య

    • హిమాయత్ సాగర్ దగ్గర మహ్మద్ అమీర్‌(25) మృతదేహం గుర్తింపు

    • మహ్మద్ అమీర్‌ని చంపి పెట్రోల్ పోసి తగులబెట్టినట్లు అనుమానం

  • Feb 22, 2026 07:51 IST

    గోల్డ్ ధరల దూకుడు.. హ్యాట్రిక్ పెరుగుదల

    • భారత్‌లో శనివారం కూడా పెరిగిన గోల్డ్, సిల్వర్ ధరలు

    • బంగారం ధర రూ.1,900ల మేర పెరిగిన వైనం

    • గోల్డ్ రేట్స్ పెరగడం వరుసగా ఇది మూడోసారి

    • హైదరాబాద్‌లో ప్రస్తుతం 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం ధర రూ.1,59,280

    • కిలో వెండి ధర రూ.2.9 లక్షలు

    పూర్తి కథనం

  • Feb 22, 2026 07:21 IST

    నేడు గుంటూరులో సీఎం చంద్రబాబు పర్యటన

    • కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో కలిసి గుంటూరులో పర్యటన

    • భారత్‌ నెట్‌ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేయనున్న సింధియా, చంద్రబాబు

    • గ్రామీణ డాక్‌ సేవక్‌ సమ్మేళనంలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు

  • Feb 22, 2026 07:20 IST

    శ్రీశైలం: వీఐపీ కాటేజీలో భక్తులకు తప్పిన ప్రమాదం

    • ఏసీలో షార్ట్‌ సర్క్యూట్‌తో చెలరేగిన మంటలు

    • భయంతో రూమ్‌ నుంచి బయటకు పరుగులు తీసిన భక్తులు

    • మంటలను ఆర్పిన ఫైర్‌ సిబ్బంది

  • Feb 22, 2026 07:19 IST

    రష్యాపై ఉక్రెయిన్‌ ప్లెమింగో క్షిపణులతో దాడి

    • ఉడ్ముర్ట్‌ రిపబ్లిక్‌ వొట్కిన్స్క్‌ మెషిన్‌ ప్లాంట్‌పై ఉక్రెయిన్‌ దాడి

    • ఖండాంతర, ఇస్కందర్‌ క్షిపణులను ప్లాంట్‌లో ఉత్పత్తి చేస్తోన్న రష్యా

    • బెల్గరోడ్‌లోనూ ఉక్రెయిన్‌ డ్రోన్ల దాడిలో ముగ్గురి మృతి

    • ఉక్రెయిన్‌లోని ఒడెసా, సుమీ నగరలపై రష్యా దాడి

  • Feb 22, 2026 07:18 IST

    టీ-20 వరల్డ్‌ కప్‌ అప్డేట్

    • నేడు మ.3.30 గంటలకు ఇంగ్లండ్‌ Vs శ్రీలంక మ్యాచ్

    • రాత్రి 7 గంటల నుంచి భారత్‌ Vs సౌతాఫ్రికా మ్యాచ్‌

  • Feb 22, 2026 07:17 IST

    9 లక్షలకు పైగా ఓటర్ల తొలగింపు

    • కేరళలో 9 లక్షలకు పైగా ఓటర్ల తొలగింపు

    • సర్‌ ప్రక్రియ తర్వాత తుది జాబితా విడుదల చేసిన ఈసీ

  • Feb 22, 2026 07:15 IST

    లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడి.. 10 మంది మృతి

    • లెబనాన్‌లోని బెగా లోయలో ఇజ్రాయెల్ దాడి

    • హిజ్బుల్లా కమాండర్ సహా 10 మంది మృతి

    • 2024లో ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం

    • ఇజ్రాయెల్ ఒప్పందాన్ని ఉల్లంఘించి దాడి చేసిందని లెబనాన్‌ ఆరోపణ

    పూర్తి కథనం