Share News

ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్

ABN , Publish Date - Feb 22 , 2026 | 01:27 PM

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్టయ్యారు. ఆదివారం నాడు బాన్సువాడ వెళ్తున్న ఆయన్ని పెద్దశంకరంపేట వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు.

ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్
MLA Raja Singh

మెదక్, ఫిబ్రవరి 22: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్టయ్యారు. ఆదివారం నాడు బాన్సువాడ వెళ్తున్న ఆయన్ని పెద్దశంకరంపేట వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు రాజాసింగ్‌ను తరలించారు. బాన్సువాడ, కామారెడ్డిలలో ఉద్రిక్త పరిస్థితులు నేపథ్యంలో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్ రావును తార్నాకలోని ఆయన నివాసంలో హౌస్ అరెస్ట్ చేశారు. కామారెడ్డికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.


కామారెడ్డి, బాన్సువాడలో హైటెన్షన్ ఎందుకంటే..?

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం కామారెడ్డి చైర్మన్ ఎన్నిక జరిగింది. ఈ సందర్భంగా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కామారెడ్డి ఎమ్మెల్యే మహేశ్వరరెడ్డితోపాటు ఆయన తండ్రిపై ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఆరోపణలు చేశారు. దీంతో అక్కడే ఉన్న ఎమ్మెల్యే తీవ్రంగా స్పందించారు. దీనిపై కాంగ్రెస్, బీజేపీకి చెందిన కింద స్థాయి నేతలు సైతం ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్నారు. ఈ వివాదం తీవ్రస్థాయికి చేరుకుంది. అదే సమయంలో కాంగ్రెస్ నేత.. బీజేపీ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి కారులో వెళ్లేందుకు ప్రయత్నించారు. అందుకు బీజేపీ కార్యకర్తలు వ్యతిరేకించారు. స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ నేత కారును బీజేపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి.. ఇరు వర్గాలను చెదరగొట్టారు.


మరోవైపు ఇదే జిల్లా బాన్సువాడలోని ఒక సూపర్ మార్కెట్‌లో ఒక మతానికి చెందిన పాట పెట్టడంపై మరో మతానికి చెందిన వ్యక్తి అభ్యంతరం వ్యక్తం చేశాడు. దాంతో వివాదం చెలరేగింది. ఈ వాగ్వాదం పెద్దది కావడంతో.. ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పోలీసులు రంగ ప్రవేశం చేశారు. వారిపై ఒక వర్గం వారు రాళ్లు రువ్వారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీ ఛార్జ్ చేయక తప్పలేదు.


ఈ వార్తలు కూడా చదవండి..

లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు..

పెళ్లికళ వచ్చేసిందే బాలా..

For TG News And Telugu News

Updated Date - Feb 22 , 2026 | 02:04 PM