Share News

పెళ్లికళ వచ్చేసిందే బాలా..

ABN , Publish Date - Feb 22 , 2026 | 08:01 AM

హైదరాబాద్ నగరానికి పెళ్లి కళ వచ్చేసింది. మూడు నెలలుగా మూఢాలు ఉన్న నేపథ్యంలో శుభకార్యాలు లేక వివాహాలు నిలిచిపోయాయి. పాల్గుణమాసం ప్రారంభం కావడంతో శుభకార్యాలు మళ్లీ ప్రారంభమయ్యాయి.

పెళ్లికళ వచ్చేసిందే బాలా..
Hyderabad Witnesses Wedding Rush

  • హైదరాబాద్‌లో మోగుతున్న పెళ్లి బాజాలు

  • నేడొక్కరోజే దాదాపు 500 వరకు వివాహాలు..

  • మే 14వ తేదీ వరకు శుభ గడియలు

  • ఫంక్షన్ హాళ్లు దొరకక తల్లిదండ్రుల ఇబ్బందులు

హైదరాబాద్, ఫిబ్రవరి 22: హైదరాబాద్ నగరానికి పెళ్లి కళ వచ్చేసింది. మూడు నెలలుగా మూఢాలు ఉన్న నేపథ్యంలో శుభకార్యాలు లేక వివాహాలు నిలిచిపోయాయి. పాల్గుణమాసం ప్రారంభం కావడంతో శుభకార్యాలు మళ్లీ ప్రారంభమయ్యాయి. నేటి నుంచి అంటే.. ఆదివారం మంచి ముహూర్తాలు ఉన్నట్లు పండితులు చెప్పడంతో నగరంలో భారీ సంఖ్యలో వివాహాలు జరగనున్నాయి. ఆదివారం ఒక్కరోజే జీహెచ్‌ఎంసీ పరిధిలో సుమారు 500 వరకు వివాహాలు జరిగే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు. గతేడాది అక్టోబర్, నవంబర్‌లో వచ్చిన ఆశ్వయుజ, కార్తీకం, మార్గశిర మాసాల్లో దాదాపు 40 వరకు ముహూర్తాలు వచ్చాయి. దీంతో చాలా మంది పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలు, ఇతర శుభకార్యాలు చేసుకున్నారు.


అయితే గతేడాది నవంబర్ 26 నుంచి మంచి ముహూర్తాలు లేకపోవడంతో శుభకార్యాలకు బ్రేక్ పడింది. ప్రస్తుతం మళ్లీ మంచి రోజులు రావడంతో ఫిబ్రవరి 25, 28, మార్చి 3, 5, 6, 7, 8, 13తో పాటు ఏప్రిల్ మొదటి, రెండు వారాలతోపాటు మేలో 14వ తేదీ వరకు శుభకార్యాలు జరుగనున్నట్లు పండితులు చెబుతున్నారు. ఆ తర్వాత జూన్ 15 వరకు మళ్లీ మంచి రోజులు లేవని చెబుతున్నారు. ఇక ఆయా రోజుల్లో పిల్లల పేర్ల బలంపై మంచి ముహుర్తాలను చూసుకుని తల్లిదండ్రులు వివాహాలను చేయించేందుకు సిద్ధమవుతున్నారు.


ఫంక్షన్ హాళ్లకు డిమాండ్..

ఫిబ్రవర్ నుంచి మే వరకు దాదాపు 20 ముహుర్తాలున్నాయి. దీంతో చాలా మంది వివాహ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే డిమాండ్ ఎక్కువగా ఉండడంతో కొందరు ఫంక్షన్ హాళ్ల యజమానులు భారీగా రేట్లు పెంచారని, కొన్ని తేదీల్లో హాళ్లు దొరకడం లేదని పలువురు తల్లిదండ్రులు వాపోతున్నారు. అధిక పెళ్లిళ్ల కారణంగా.. పూల వ్యాపారులు, డెకరేషన్ నిర్వాహకులు బిజీ బిజీగా ఉన్నారు . చాలా మంది ఇప్పటికే వారికి నగదు అడ్వాన్స్‌ ఇచ్చారు. మొత్తంగా ఈ నాలుగు నెలల్లో శుభముహూర్తాలు కారణంగా ఇళ్లలో బాజా మోగించనున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి

తెలుగువారందరూ ఒక్కటే.!

టీ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు హౌస్ అరెస్ట్

Updated Date - Feb 22 , 2026 | 09:23 AM