Share News

ఘోర ప్రమాదం.. పోలీసుల బొలెరోను ఢీకొట్టిన ట్రక్కు.. ఐదుగురి మృతి

ABN , Publish Date - Feb 22 , 2026 | 11:33 AM

ఒడిశాలోని ఝార్సుగూడ జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున పెను విషాదం చోటుచేసుకుంది. వేగంగా దూసుకొచ్చిన ట్రక్కు.. పోలీసుల బొలెరో వాహనాన్ని బలంగా ఢీకొట్టింది.

ఘోర ప్రమాదం.. పోలీసుల బొలెరోను ఢీకొట్టిన ట్రక్కు.. ఐదుగురి మృతి
Odisha Accident News

ఇంటర్నెట్ డెస్క్: ఒడిశా(Odisha)లోని ఝార్సుగూడ జిల్లా(Jharsuguda district)లో ఆదివారం తెల్లవారుజామున పెను విషాదం చోటుచేసుకుంది. జాతీయ రహదారిపై, ఝార్సుగూడ సదర్ పోలీస్ స్టేషన్ సమీపంలో పోలీసులు ప్రయాణిస్తున్న బొలెరో వాహనాన్ని, వేగంగా దూసుకొచ్చిన ట్రక్కు బలంగా ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు పోలీసులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడటంతో వారిని దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. ట్రక్కు ఢీకొన్న వేగానికి బొలెరో వాహనం నుజ్జునుజ్జు అయ్యింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులను ఆస్పత్రిలో చేర్పించారు.


మరణించిన సిబ్బందిని సాయుధ పోలీస్ రిజర్వ్ కానిస్టేబుళ్లు కాశీరామ్ భోయ్, దేబేంద్ర సా, హవల్దార్ లింగరాజ్ ధరువా, సబ్-ఇన్‌స్పెక్టర్ నిరంజన్ కుజుర్, హోంగార్డు భక్త బంధు మిర్ధాగా గుర్తించారు. ప్రస్తుతం వారికి మెరుగైన చికిత్స అందిస్తున్నారని అధికారులు తెలిపారు. విధి నిర్వహణలో అమరులైన పోలీసులకు పోలీస్ శాఖ తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

చందమామ ‘చిన్న’బోతోంది

జీపీ భవనం కోసం అప్పు..సొంత భూమి తనఖా

Read Latest Telangana News and National News

Updated Date - Feb 22 , 2026 | 12:18 PM