Share News

ఇదోరకం ‘ప్రీ వెడ్డింగ్‌’

ABN , Publish Date - Feb 22 , 2026 | 09:37 AM

హల్దీ, సంగీత్‌, ఫొటోషూట్‌.... ఇలా రకరకాల ప్రీ వెడ్డింగ్‌ వేడుకలను చూసే ఉంటారు. కానీ జర్మనీలో జరిగే ప్రీ వెడ్డింగ్‌ వేడుక మాత్రం చాలా వింతగా, ఒకింత గమ్మత్తుగా ఉంటుంది.

ఇదోరకం ‘ప్రీ వెడ్డింగ్‌’

హల్దీ, సంగీత్‌, ఫొటోషూట్‌.... ఇలా రకరకాల ప్రీ వెడ్డింగ్‌ వేడుకలను చూసే ఉంటారు. కానీ జర్మనీలో జరిగే ప్రీ వెడ్డింగ్‌ వేడుక మాత్రం చాలా వింతగా, ఒకింత గమ్మత్తుగా ఉంటుంది. దాన్ని చూస్తే ఎవరైనా ఆశ్చర్యంతో ఓ నవ్వు నవ్వాల్సిందే...

ఒక్కో దేశంలో ఒక్కోరకమైన సంప్రదా యాలు, ఆచారాలు కనిపిస్తుంటాయి. అందులో కొన్ని వింతగానూ, ఆశ్చర్య కరంగానూ ఉంటాయి. జర్మనీలో అలాంటి వింతైన సంప్రదాయం ఇప్పటికీ కొనసాగు తోంది. అక్కడ ప్రీ వెడ్డింగ్‌ వేడుకలో భాగంగా అతిథులు పాత పింగాణీ పాత్రలు తీసుకొచ్చి వధూవరుల ముందు నేలకేసి కొడతారు. అతిథులు పగలగొట్టిన పింగాణీ పాత్రల ముక్కలను వధూవరులు ఇద్దరూ కలిసి శుభ్రం చేస్తారు. ఈ సంప్ర దాయం కొన్ని వందల ఏళ్లుగా అక్కడ కొనసాగుతూ వస్తోంది. ఈ సంప్రదాయ వేడుకను ‘పొల్టెరాబెండ్‌’ అని పిలుస్తారు. పొల్టెరాబెండ్‌లో ‘పొల్టెర్న్‌’ అంటే శబ్దం చేయడం, ‘అబెండ్‌’ అంటే సాయంత్రం అని అర్థం. స్థూలంగా పెళ్లికి ముందు ఒక సాయంత్రం బంధుమిత్రుల సమక్షంలో నిర్వహించే వేడుక ఇది.


book5.2.jpgఎందుకు చేస్తారంటే...

పెళ్లికి ముందు ఈ వేడుకను జరపడం వెనక అనేక కారణాలున్నాయి. పెళ్లికి వధూవరులు సిద్ధంగా ఉన్నారా? లేదా? పరీక్షించడం కోసం ‘పొల్టెరాబెండ్‌’ వేడుకను జరుపుతారు. అలాగే వధూవరుల మధ్య బంధం, సహకారం పెరిగేందుకు, సమస్య ఏదైనా ఇద్దరూ కలిసి పరిష్కరించుకునేలా, బాధ్యతలను పంచుకునేలా చేసేందుకు ఈ వేడుకను నిర్వహిస్తారు.

వేడుకలో ఇరువురి కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులు పాల్గొంటారు. జర్మన్‌ భాషలో దీనిని ‘షెర్బెన్‌బ్రింగెన్‌ గ్లక్‌’ అని చెబుతారు. అంటే ముక్కలు అదృష్టాన్ని తెస్తాయి అని అర్థం.


book5.3.jpgనూతన వధూవరుల వైవాహిక జీవితం సంతోషంగా గడవాలని ఆకాంక్షిస్తారు. వేడుకకు వచ్చే అతిథులే తమ ఇంటి నుంచి పాత పింగాణీ పాత్రలు తీసుకొచ్చి వధూవరుల ముందు నేలకొసి కొడతారు. అలా పగల గొట్టేందుకు పింగాణీ పాత్రలు, బౌల్స్‌, పాత వాష్‌బేసిన్స్‌, టాయిలెట్‌ కుండీలు, పూలకుండీలు ఉపయోగిస్తారు. వాటిని వధూవరులు ఇద్దరూ కలిసికట్టుగా ఓపికతో శుభ్రం చేయాల్సి ఉంటుంది. శబ్దంతో దుష్టశక్తులు దూరమవుతాయని జర్మన్లు నమ్ముతారు. దురదృష్టం పారిపో తుందని విశ్వసిస్తారు. జీవితంలో అని వార్యంగా ఎదురయ్యే సమస్యలకు వధూ వరులను సిద్ధం చేయడానికి ఈ వేడుక ఉపకరిస్తుందని భావిస్తారు. ఏదేమైనా ఇదొక విభిన్న, వింతైన ఆచారమే కదూ!


ఈ వార్తలు కూడా చదవండి:

చందమామ ‘చిన్న’బోతోంది

జీపీ భవనం కోసం అప్పు..సొంత భూమి తనఖా

Read Latest Telangana News and National News

Updated Date - Feb 22 , 2026 | 10:14 AM