Share News

లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడి.. 10 మంది మృతి

ABN , Publish Date - Feb 22 , 2026 | 07:36 AM

లెబనాన్‌లోని బెగా లోయలో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో సీనియర్ హిజ్బుల్లా కమాండర్ సహా 10మంది చనిపోగా.. 50మంది తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే..

లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడి.. 10 మంది మృతి
Israel Lebanon Conflict

ఇంటర్నెట్ డెస్క్: లెబనాన్‌(Lebanon)లోని బెకా లోయ(Bekaa Valley)లో నిన్న (శుక్రవారం) సాయంత్రం ఇజ్రాయెల్ వైమానిక దాడులు నిర్వహించింది. ఈ దాడిలో సీనియర్ హిజ్బుల్లా కమాండర్ సహా 10 మంది మృతిచెందగా.. 50మంది తీవ్రంగా గాయపడ్డారు. మరణించిన వారిలో సాధారణ పౌరులు కూడా ఉన్నారని, గాయపడిన వారిలో చిన్నారులు ఉన్నారని లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.


2024లో ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ఉన్నప్పటికీ ఇలాంటి దాడులు జరగడం చర్చనీయాంశంగా మారింది. కాల్పుల విరమణ కుదిరిన తర్వాత జరిగిన అతిపెద్ద దాడుల్లో ఇది ఒకటి అని లెబనాన్ ఆరోపిస్తోంది. మరోవైపు తమపై రాకెట్ దాడులకు హిజ్బుల్లా వ్యూహాలు రచిస్తోందని, అందుకే ముందస్తు దాడులు చేశామని ఇజ్రాయెల్ చెబుతోంది. ఇజ్రాయెల్ దాడి నేపథ్యంలో లెబనాన్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.


ఈ వార్తలు కూడా చదవండి..

క్వాంటం ఎకో సిస్టంతో.. ఏపీకి ప్రపంచ స్థాయిలో గుర్తింపు: సీఎం చంద్రబాబు

లోకేశ్ విందులో రాజకీయ ఏకత్వం.. కుటుంబ విలువల ప్రతిబింబం..

Updated Date - Feb 22 , 2026 | 09:18 AM