క్వాంటం ఎకో సిస్టంతో.. ఏపీకి ప్రపంచ స్థాయిలో గుర్తింపు: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Feb 20 , 2026 | 04:45 PM
డీప్ టెక్నాలజీ రంగంలో మరింత ముందుకెళ్లేలా తమ ప్రభుత్వం దృష్టి సారిస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఏపీలో స్పేస్, డ్రోన్, ఎలక్ట్రానిక్స్, మెడ్‌టెక్ పార్క్ లాంటి ప్రత్యేక పారిశ్రామిక క్లస్టర్లు ఉన్నాయని పేర్కొన్నారు..
ఢిల్లీ, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): డీప్ టెక్నాలజీ రంగంలో మరింత ముందుకెళ్లేలా తమ ప్రభుత్వం దృష్టి సారిస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) వ్యాఖ్యానించారు. ఏపీలో స్పేస్, డ్రోన్, ఎలక్ట్రానిక్స్, మెడ్‌టెక్ పార్క్ లాంటి ప్రత్యేక పారిశ్రామిక క్లస్టర్లు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ రంగాల్లో పెద్దఎత్తున పెట్టుబడులను ఆకర్షించటంతో పాటు.. క్వాంటం ఎకో సిస్టంను తీర్చిదిద్దుతున్నామని వివరించారు. ఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్-2026’ రౌండ్ టేబుల్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ (శుక్రవారం) హాజరయ్యారు.
ఏఐ డేటా హబ్‌గా విశాఖపట్నం..
వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహిస్తున్న కృత్రిమ మేథస్సు ద్వారా పోటీతత్వం అంశంపై జరుగుతున్న రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌కు సీఎం చంద్రబాబు హాజరై.. తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌లో కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం సీఈఓ బోర్కే బ్రెండేతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రసంగించారు. సమీప భవిష్యత్‌లో అమరావతి క్వాంటం వ్యాలీ గురించి ప్రపంచం అంతా మాట్లాడే రోజు వస్తుందని చెప్పుకొచ్చారు. గూగుల్ లాంటి సంస్థల రాకతో ఏపీలోని విశాఖపట్నం ఏఐ డేటా హబ్‌గా మారుతుందని తెలిపారు.
ఎకో సిస్టం రూపకల్పన చేస్తున్నాం..
ప్రపంచానికి క్వాంటం కంప్యూటింగ్‌కు సంబంధించిన పరికరాలను కూడా తయారు చేసేలా క్వాంటం ఎకో సిస్టం రూపకల్పన చేస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. దేశాన్ని అగ్రస్థానంలో నిలబెట్టాలన్న ఆకాంక్షతో ప్రధాని నరేంద్రమోదీ పనిచేస్తున్నారని.. దేశం దాన్ని సాధించి తీరుతుందని అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అద్భుతాలను సాధిస్తుందనే విశ్వాసం తమకు ఉందని చెప్పుకొచ్చారు. పౌరులందరికీ ప్రయోజనం కలిగేలా సావరిన్ ఏఐని వినియోగించేందుకు ప్రభుత్వ పరంగా ప్రయత్నం చేస్తున్నామని వివరించారు. డీపీ టెక్నాలజీ రంగంలో మరింత ముందుకెళ్లేలా ఏపీ దృష్టి సారిస్తోందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
జాతిపిత ప్రజల్లోకి ఎందుకు రావట్లేదు.. కేసీఆర్‌పై కడియం శ్రీహరి సెటైర్లు
మల్లికార్జున ఖర్గేతో తెలంగాణ కాంగ్రెస్ నేతల భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ..
Read Latest Telangana News And AP News And Telugu News