Share News

గోల్డ్ ధరల దూకుడు.. హ్యాట్రిక్ పెరుగుదల

ABN , Publish Date - Feb 22 , 2026 | 06:52 AM

దేశంలో బంగారం, వెండి ధరలు గత మూడు రోజులుగా పెరుగుతూనే ఉన్నాయి. మరి నేటి రేట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం పదండి

గోల్డ్ ధరల దూకుడు.. హ్యాట్రిక్ పెరుగుదల
Gold, Silver Rates on Feb 22

ఇంటర్నెట్ డెస్క్: బంగారం, వెండి ధరలు మళ్లీ పుంజుకుంటున్నాయి. గత మూడు రోజులుగా ధరలు పెరుగుతూనే ఉన్నాయి. శనివారం భారత్‌లో బంగారం ఏకంగా రూ.1,900ల మేర పెరిగింది. వెండి ధర కూడా సగటున రూ.5 వేల మేర పెరిగింది.

గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, ఆదివారం ఉదయం 6.00 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,59,280గా ఉంది. నిన్న ఇదే సమయానికి ఉన్న ధరతో పోలిస్తే ఇది రూ.1,910 ఎక్కువ. ఇక 22 క్యారెట్ ఆర్నమెంటల్ బంగారం ధర కూడా రూ.1,750ల మేర పెరిగి రూ.1,46,000కు చేరింది. వెండి ధరలో కూడా భారీ పెరుగుదల నమోదైంది. రూ.20 వేల మేర పెరిగి రూ.2.9 లక్షలకు చేరుకుంది. గత వారం హైదరాబాద్‌లో వెండి ధర సుమారు రూ.30 వేల మేర పెరిగింది (Gold, Silver Rates in India on Feb 22).

ఇరాన్-అమెరికా యుద్ధ భయాలు, సుంకాలు చెల్లవంటూ అమెరికా సుప్రీం కోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో బంగారం, వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో బలహీనతలు కూడా ఇన్వెస్టర్లను సురక్షిత పెట్టుబడి సాధనాలైన బంగారం, వెండి వైపు మళ్లిస్తున్నాయని అంటున్నారు.


ప్రధాన నగరాల్లో 10 గ్రాముల బంగారం (24కే, 22కే) ధరలు ఇవీ

  • చెన్నై: ₹1,60,150; ₹1,46,800

  • ముంబై: ₹1,59,280; ₹1,46,000

  • ఢిల్లీ: ₹1,59,430; ₹1,46,150

  • కోల్‌కతా: ₹1,59,280; ₹1,46,000

  • బెంగళూరు: ₹1,59,280; ₹1,46,000

  • హైదరాబాద్: ₹1,59,280; ₹1,46,000

  • విజయవాడ: ₹1,59,280; ₹1,46,000

  • కేరళ: ₹1,59,280; ₹1,46,000

  • పుణె: ₹1,59,280; ₹1,46,000

  • వడోదరా: ₹1,59,330; ₹1,46,050

  • అహ్మదాబాద్: ₹1,59,330; ₹1,46,050

వెండి ధరలు ఇవీ

  • చెన్నై: ₹2,90,000

  • ముంబై: ₹2,75,000

  • ఢిల్లీ: ₹2,75,000

  • కోల్‌కతా: ₹2,75,000

  • బెంగళూరు: ₹2,75,000

  • హైదరాబాద్: ₹2,90,000

  • విజయవాడ: ₹2,90,000

  • కేరళ: ₹2,90,000

  • పుణె: ₹2,75,000

  • వడోదరా: ₹2,75,000

  • అహ్మదాబాద్: ₹2,75,000


గమనిక: ఈ సమాచారం కేవలం పాఠకులకు అవగాహన కోసం మాత్రమే. బంగారం ధరలు పరిస్థితులను బట్టి మారుతూ ఉంటాయి. అంతేకాదు, నగరాన్ని బట్టి, మేకర్/జ్యువెలర్ ఆధారంగా కొద్దిగా తేడా ఉండవచ్చు. కచ్చితమైన ధరల కోసం స్థానిక బంగారు షాపులతో పోల్చి చూసుకోవాల్సి ఉంటుంది.

ఈ వార్తలూ చదవండి

త్వరలో అమల్లోకి రానున్న పాన్ కార్డు నిబంధనలు ఇవేనా!

పీఎస్ఎల్వీ-సీ62 వైఫల్యంపై విశ్లేషణ కమిటీ

Updated Date - Feb 22 , 2026 | 07:32 AM