Share News

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ABN , First Publish Date - Feb 16 , 2026 | 07:00 AM

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN Breaking News

Live News & Updates

  • Feb 16, 2026 21:59 IST

    ఏపీ రెవెన్యూ శాఖలో పోస్టు పేరు మార్పు..

    • అమరావతి: ఏపీ రెవెన్యూ శాఖలో పోస్టు పేరు మార్పు..

    • జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టు పేరును మారుస్తూ ఉత్తర్వులు..

    • జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్‌గా మార్పు..

    • ఇక నుంచి జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్‌గా పరిగణిస్తూ ఉత్తర్వులు..

    పూర్తి కథనం..

  • Feb 16, 2026 21:20 IST

    ఆ రైళ్లల్లో ఎమర్జెన్సీ కోటా పునరుద్ధరణ..

    • వందేభారత్ స్లీపర్, అమృత్ భారత్ రైళ్లల్లో ఎమర్జెన్సీ బెర్త్‌ల కేటాయింపు పునరుద్ధరణ..

    • మార్గదర్శకాలు జారీ చేసిన రైల్వే శాఖ..

    పూర్తి కథనం..

  • Feb 16, 2026 21:11 IST

    మదనపల్లెలో అగ్ని ప్రమాదం..

    • అన్నమయ్య జిల్లా: మదనపల్లె నీరుగట్టువారిపల్లెలోని స్పేర్ పార్ట్స్ దుకాణంలో అగ్ని ప్రమాదం..

    • సుమారు రూ.10 లక్షల వరకు నష్టం జరిగిందని బాధితుడి ఆవేదన..

    • మంటలను అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది..

    • అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది..

    పూర్తి కథనం..

  • Feb 16, 2026 21:08 IST

    రేపు, ఎల్లుండి డిప్యూటీ సీఎం.. విశాఖ పర్యటన..

    • అమరావతి: రేపు, ఎల్లుండి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. విశాఖ పర్యటన..

    • అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ (IFR) కార్యక్రమాల్లో పాల్గొననున్న పవన్ కల్యాణ్..

    • సాయంత్రం గవర్నర్‌తో కలిసి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు స్వాగతం పలకనున్న డిప్యూటీ సీఎం..

  • Feb 16, 2026 21:03 IST

    నాలుగేళ్ల చిన్నారిపై దారుణం..

    • కృష్ణా జిల్లా పెదపారుపూడి మండలంలో దారుణం..

    • నాలుగేళ్ల బాలికపై పెదనాన్న వరసయ్యే వ్యక్తి లైంగిక దాడి..

    • నిందితుడిని అరెస్టు చేసి.. ఫోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు..

    • కేసు వివరాలను వెల్లడించిన గుడివాడ డీఎస్పీ ధీరజ్ వినిల్..

    పూర్తి కథనం..

  • Feb 16, 2026 20:06 IST

    సీఎం చంద్రబాబును కలిసిన తెలంగాణ మంత్రి తుమ్మల

    • అమరావతి: సీఎం చంద్రబాబును కలిసిన తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు..

    • ఏపీలో కలిపిన 5 గ్రామ పంచాయతీలను.. తిరిగి తెలంగాణలో కలిపేందుకు సహకరించాలని విజ్ఞప్తి..

    • తిరుమలలో తెలంగాణకి 5 ఎకరాల స్థలం కేటాయించాలని విన్నపం..

    • ఖమ్మంలో టీటీడీ దేవస్థానం నిర్మాణానికి సహకరించాలని తుమ్మల విజ్ఞప్తి..

    పూర్తి కథనం..

  • Feb 16, 2026 17:09 IST

    మున్సిపల్‌ ఎన్నికల్లో బీజేపీని ప్రజలు ఆదరించారు: రాంచందర్‌రావు

    • తెలంగాణలో బీజేపీ ఓట్ల శాతం పెరిగింది..

    • గతంలో కంటే ఎక్కువ స్థానాల్లో బీజేపీ గెలిచింది..

    • భైంసాలో బీజేపీ రాకుండా చేయాలని చాలా ప్రయత్నాలు చేశారు..

    • 15 మున్సిపాలిటీల్లో గట్టిపోటీ ఇచ్చాం: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రాంచందర్‌రావు

    పూర్తి కథనం..

  • Feb 16, 2026 16:54 IST

    టీ20 ప్రపంచ కప్: ఇటలీ టార్గెట్ 203

    • ఈడెన్ గార్డెన్స్ వేదికగా తలపడుతున్న ఇంగ్లండ్-ఇటలీ జట్లు..

    • నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసిన ఇంగ్లండ్..

    • హాఫ్ సెంచరీతో చెలరేగిన విల్ జాక్స్(53*)..

    • క్రిషన్, స్టీవర్ట్‌లకు తలో 2, స్మట్స్, అలీ హసన్, మానేంటిలకు చెరొక వికెట్..

    • ఇటలీ విజయ లక్ష్యం 203 పరుగులు..

  • Feb 16, 2026 16:09 IST

    గేట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యం కీలకం: పవన్ కల్యాణ్

    • అమరావతి: సీఎం చంద్రబాబుతో కలిసి బిల్‌గేట్స్‌కు ఆత్మీయ స్వాగతం పలకడం ఆనందంగా ఉంది..

    • ఏపీ ప్రభుత్వంతో భాగస్వామ్యానికి గేట్స్ ఫౌండేషన్ చూపుతున్న నిబద్ధతకు అభినందనలు..

    • విద్య, ఆరోగ్యం, వ్యవసాయ రంగాల బలోపేతానికి గేట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యం కీలకం..

    • సామాజిక మాధ్యమం ఎక్స్‌లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..

    పూర్తి కథనం..

  • Feb 16, 2026 16:05 IST

    భారీ లాభాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

    • 650 పాయింట్ల లాభంతో ముగిసిన సెన్సెక్స్‌..

    • 211 పాయింట్ల లాభంతో ముగిసిన నిఫ్టీ..

  • Feb 16, 2026 15:45 IST

    ఆర్టీసీ బస్సుకు తప్పిన ప్రమాదం..

    • నంద్యాల: దోర్నాల - ఆత్మకూరు నల్లమల ఘాట్ రోడ్‌లో ఆర్టీసీ బస్సుకు తప్పిన ప్రమాదం..

    • సడన్‌గా రోడ్డు పక్కకు ఒరిగిన డోన్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు..

    • ప్రయాణికులు అప్రమత్తమై బస్సులో నుంచి దిగడంతో తప్పిన ప్రమాదం..

    పూర్తి కథనం..

  • Feb 16, 2026 15:36 IST

    తెలంగాణలో పలు చోట్ల మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నిక వాయిదా

    • ఇబ్రహీంపట్నం, కాగజ్‌నగర్‌, జనగామ, ఇంద్రేశం, జహీరాబాద్‌,..

    • సుల్తానాబాద్‌, ఖానాపూర్, తొర్రూర్‌, డోర్నకల్‌..

    • ఇల్లందు, క్యాతనపల్లి మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నిక రేపటికి వాయిదా

  • Feb 16, 2026 15:24 IST

    తెలంగాణ రైతులకు శుభవార్త..

    • పెండింగ్ బోనస్ బకాయిలు రూ. 514.36 కోట్ల విడుదల..

    • క్వింటాకు రూ.500 చొప్పున చెల్లింపు..

    • 2.17 లక్షల మంది రైతులకు నేరుగా లబ్ధి..

    • ఇప్పటి వరకు రూ.1,939.58 కోట్లు బోనస్‌గా చెల్లింపు..

    పూర్తి కథనం..

  • Feb 16, 2026 14:50 IST

    టీ20 ప్రపంచ కప్: యూఏఈతో మ్యాచ్.. అఫ్గానిస్తాన్ విజయం

    • అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో గెలుపొందిన అఫ్గానిస్తాన్

    • యూఏఈ నిర్దేశించిన 161 పరుగుల లక్ష్యాన్ని19.2 ఓవర్లలో ఛేదించిన అఫ్గాన్ బ్యాటర్లు

    • ఇబ్రహీం జర్దాన్(53) హాఫ్ సెంచరీ

    • యూఏఈ బౌలర్లలో జునైద్, ఆర్ఫాన్‌లకు 2, జవాదుల్లాకు ఒక వికెట్

  • Feb 16, 2026 14:49 IST

    తొర్రూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదా

    • మహబూబాబాద్ : తొర్రూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదా

    • మున్సిపల్ కార్యాలయం నుంచి బయటకు వెళ్లిపోయిన ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి

  • Feb 16, 2026 14:43 IST

    డోర్నకల్ మున్సిపాలిటీలో ట్విస్ట్

    • మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మున్సిపాలిటీలో ట్విస్ట్

    • ప్రమాణ స్వీకారానికి హాజరుకాని కాంగ్రెస్ కౌన్సిలర్లు

    • కోరం లేకపోవడంతో వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన అధికారులు

    • చైర్మన్ వైస్ చైర్మన్ విషయంలో కాంగ్రెస్‌లో కుదరని ఏకాభిప్రాయం

    పూర్తి కథనం..

  • Feb 16, 2026 13:54 IST

    సంగారెడ్డి: పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి పరోక్ష వ్యాఖ్యలు

    • కాంగ్రెస్, స్థానిక నేతలను ఉద్దేశించి బుల్లెట్ దిగిందా లేదా అంటూ ఎమ్మెల్యే వ్యాఖ్యలు

    • వాయిదా పడిన ఇంద్రేశం మున్సిపాలిటీ BRSకు దక్కే అవకాశం

  • Feb 16, 2026 13:54 IST

    అశ్వారావుపేట మున్సిపల్ పీఠం కాంగ్రెస్ కైవసం

    • చైర్‌పర్సన్, వైస్ చైర్మన్‌గా భార్యాభర్తల ఎన్నిక

    • చైర్‌పర్సన్‌గా శశికళ, వైస్ చైర్మన్‌గా రమేష్‌ ఎన్నిక

  • Feb 16, 2026 13:53 IST

    నిర్మల్ మున్సిపల్ పీఠం కాంగ్రెస్ కైవసం

    • చైర్‌పర్సన్‌గా అప్పాల కావ్య, వైస్ చైర్మన్‌గా గణేష్ చక్రవర్తి ఎన్నిక

  • Feb 16, 2026 13:48 IST

    కరీంనగర్ కార్పొరేషన్‌లో మేయర్ ఎన్నికపై స్పందించిన బండి సంజయ్

    • కాంగ్రెస్ అధికార దుర్వినియోగానికి పాల్పడింది: కేంద్రమంత్రి బండి సంజయ్

    • పక్క దేశాన్ని క్రికెట్‌లో ఇండియా ఓడించింది: బండి సంజయ్

    • పక్క పార్టీలను కబడ్డీలో బీజేపీ ఓడించింది: బండి సంజయ్

    • బీజేపీ బలపడితే కాంగ్రెస్ భయపడుతోంది: బండి సంజయ్

    • మోదీకి మాటిచ్చా.. కరీంనగర్ గెలిపించా: బండి సంజయ్

  • Feb 16, 2026 13:43 IST

    ఆదిలాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ గా బండారి అనూష

    Adilabad.jpg

  • Feb 16, 2026 13:27 IST

    జోగులాంబ గద్వాల: అయిజ మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం

    • అయిజ మున్సిపాలిటీ చైర్మన్‌గా సీఎం సురేశ్ ఎన్నిక

    • 13వ వార్డు నుంచి ఎన్నికైన సురేశ్

    • వైస్ చైర్మన్ గా 8వ వార్డు నుంచి ఎన్నికైన మాల నరసింహులు(BRS పార్టీ)

    iJA.jpg

  • Feb 16, 2026 13:14 IST

    సిద్దిపేట: ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో BRS నిరసన

    • డబ్బులకు చైర్మన్ పదవి అమ్ముకున్నారని ఆరోపణ

    • ప్రతాప్‌రెడ్డి డౌన్ డౌన్ అంటూ BRS శ్రేణుల నినాదాలు

  • Feb 16, 2026 13:12 IST

    పీవీ సింధూతో బ్యాడ్మింటన్‌..

    • విజయవాడ: పటమట ఇండోర్ స్టేడియంలో బిల్‌ గేట్స్‌

    • పీవీ సింధూతో బ్యాడ్మింటన్‌ ఆడిన బిల్‌ గేట్స్‌

  • Feb 16, 2026 13:04 IST

    నారాయణపేట మున్సిపాలిటీ బీజేపీ కైవసం

    • నారాయణపేట చైర్‌పర్సన్‌గా శ్వేతా యాదవ్‌

    • BRS కౌన్సిలర్ల గైర్హాజరుతో బీజేపీ కైవసం

  • Feb 16, 2026 13:00 IST

    నిజామాబాద్ మేయర్‌గా ఉమారాణి(కాంగ్రెస్)

    • కరీంనగర్‌ మేయర్‌గా కొలగాని శ్రీనివాస్(బీజేపీ)

    • కరీంనగర్ డిప్యూటీ మేయర్‌గా సునీల్‌రావు(బీజేపీ)

    • నల్లగొండ మేయర్‌గా చైతన్య శ్రీనివాస్‌రెడ్డి(కాంగ్రెస్)

    • నల్లగొండ డిప్యూటీ మేయర్‌గా అష్రఫ్ అలీ(కాంగ్రెస్)

    • కొత్తగూడెం మేయర్‌గా గణేష్‌(సీపీఐ), డిప్యూటీ మేయర్‌గా లలిత (కాంగ్రెస్‌)

    • పెద్దపల్లి మేయర్‌గా స్వామి, డిప్యూటీ మేయర్‌గా ఎల్లయ్య (కాంగ్రెస్)

  • Feb 16, 2026 12:55 IST

    కరీంనగర్‌ మేయర్ పీఠం బీజేపీ కైవసం

    • కరీంనగర్‌ మేయర్ పీఠం బీజేపీ కైవసం

    • ఎటువైపు మొగ్గుచూపని BRS

    • కరీంనగర్ మేయర్‌గా కొలగాని శ్రీనివాస్(బీజేపీ)

    • డిప్యూటీ మేయర్‌గా సునీల్‌రావు(బీజేపీ)

    • నిజామాబాద్ మేయర్‌ పీఠాన్ని దక్కించుకున్న కాంగ్రెస్

    • నిజామాబాద్ మేయర్‌గా ఉమారాణి(కాంగ్రెస్)

  • Feb 16, 2026 12:40 IST

    మక్తల్ కాంగ్రెస్ దే

    • మక్తల్ మున్సిపాలిటీ చైర్ పర్సన్‌గా కాంగ్రెస్ అభ్యర్థి వాకిటి మానస

    • చైర్ పర్సన్‌గా ప్రమాణస్వీకారం చేసిన 14వ వార్డు కౌన్సిలర్ మానస

    • మక్తల్ మున్సిపాలిటీ వైస్ చైర్‌పర్సన్‌గా శైవి రెడ్డి(కాంగ్రెస్)

    • వైస్ చైర్‌పర్సన్‌గా ప్రమాణ స్వీకారం చేసిన 9వార్డు కౌన్సిలర్ శైవిరెడ్డి

    Makthal.jpg

  • Feb 16, 2026 12:36 IST

    వీడిన ఉత్కంఠ

    • సంగారెడ్డి: జిన్నారం మున్సిపల్ చైర్మన్‌గా బీఆర్ఎస్‍కు చెందిన జనార్దన్

    • చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన బీఆర్ఎస్ అభ్యర్థి జనార్దన్

    BRS.jpg

  • Feb 16, 2026 12:29 IST

    వనపర్తి మున్సిపాలిటీ అప్డేట్

    • వనపర్తి మున్సిపాలిటీ చైర్ పర్సన్‌గా కాంగ్రెస్ అభ్యర్థి మీడిదొడ్డి మాధవి

    • వైస్ చైర్మన్‌గా గుర్రకొండ మధుసూదన్ రెడ్డి ఎన్నిక

    • ప్రమాణస్వీకారం చేసిన చైర్ పర్సన్, వైస్ చైర్మన్

    Wanaparthi.jpg

  • Feb 16, 2026 12:26 IST

    వనపర్తి: కొత్తకోట మున్సిపాలిటీ వైస్ చైర్‌పర్సన్‌గా కాంగ్రెస్ అభ్యర్థి పల్లవి కృష్ణారెడ్డి

    • వైస్ చైర్‌పర్సన్‌గా ప్రమాణస్వీకారం చేసిన 13వ వార్డు కౌన్సిలర్ పల్లవి కృష్ణారెడ్డి

    Kothakota-2.jpg

  • Feb 16, 2026 12:24 IST

    వనపర్తి: కొత్తకోట మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌గా కాంగ్రెస్ అభ్యర్థి అరుణ శ్రీనివాస్

    • చైర్‌పర్సన్‌గా ప్రమాణ స్వీకారం చేసిన 9వ వార్డు కౌన్సిలర్ అరుణ శ్రీనివాస్

    Kothakota.jpg

  • Feb 16, 2026 12:14 IST

    మహబూబాబాద్: తొర్రూర్ మున్సిపాలిటీ ఎదుట ఉద్రిక్తత

    • BRS-కాంగ్రెస్ వర్గీయుల పరస్పర వ్యతిరేక నినాదాలు

    • ఎంపీ కడియం కావ్య ఓటు వేయడానికి వీల్లేదంటూ BRS నిరసన

    • ఎర్రబెల్లి దయాకర్‌ గో బ్యాక్ అంటూ కాంగ్రెస్ నినాదాలు

    • రంగంలోకి దిగిన ఎస్పీ శబరీష్, ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులు

  • Feb 16, 2026 12:14 IST

    సంగారెడ్డి: ఇస్నాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో ట్విస్ట్

    • ఎక్స్‌ అఫీషియో ఓట్లతో ఇస్నాపూర్ పీఠం BRS కైవసం చేసుకునే ఛాన్స్

    • ఎక్స్‌ అఫీషియో ఓటు వేయడానికి ఒకే కారులో వచ్చిన..

    • BRS ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు

  • Feb 16, 2026 12:13 IST

    నల్లగొండ కార్పొరేషన్ మేయర్‌గా చైతన్య

    • కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్‌గా గణేష్‌(సీపీఐ)

    • డిప్యూటీ మేయర్‌గా లలిత (కాంగ్రెస్‌)

  • Feb 16, 2026 12:00 IST

    కామారెడ్డిలో బిగ్ ట్విస్ట్

    • బీజేపీకి చెక్ పెట్టేందుకు ఒక్కటైన కాంగ్రెస్, బీఆర్ఎస్

    • ఇండిపెండెంట్ అభ్యర్థి ఉమారాణికి చైర్‌పర్సన్ పీఠం

    • స్వతంత్ర అభ్యర్థికి మద్దతు తెలుపుతున్న కాంగ్రెస్, BRS

    • వైస్ చైర్మన్ పదవిని కోరిన BRS నేతలు

  • Feb 16, 2026 11:59 IST

    కరీంనగర్ మేయర్ అభ్యర్థి ఇతనే..

    • కరీంనగర్‌ కార్పొరేషన్ బీజేపీ మేయర్ అభ్యర్థిగా కొలగాని శ్రీనివాస్

    • డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా సునీల్‌రావును ఖరారు చేసిన బీజేపీ

  • Feb 16, 2026 11:58 IST

    తమిళనాడు: కడలూరు దగ్గర రోడ్డుప్రమాదం

    • టిప్పర్‌ను ఢీకొట్టిన కారు.. నలుగురి మృతి

    • చెన్నై-తిరుచ్చి జాతీయ రహదారిపై ప్రమాదం

  • Feb 16, 2026 11:57 IST

    జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ వర్గానికే చైర్‌పర్సన్ పీఠం

    • జగిత్యాల మున్సిపల్ చైర్‌పర్సన్‌గా సమిండ్ల వాణి

    • వైస్‌చైర్‌పర్సన్‌గా జీవన్‌రెడ్డి వర్గానికి చెందిన పర్వీన్

    పూర్తి కథనం

  • Feb 16, 2026 11:35 IST

    చరిత్ర సృష్టించిన ఇషాన్ కిషన్

    • పాక్‌తో మ్యాచ్‌లో సంచలన ఇన్నింగ్స్ ఆడిన ఇషాన్ కిషన్

    • ఇషాన్ కిషన్(77)కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డ్

    • ఈ అవార్డ్ అందుకున్న తొలి భారత వికెట్ కీపర్‌గా ఇషాన్ కిషన్ రికార్డ్

    పూర్తి కథనం

  • Feb 16, 2026 11:30 IST

    బిల్‌ గేట్స్‌కు సీఎం చంద్రబాబు ఆత్మీయ స్వాగతం

    • హలో ఫ్రెండ్‌.. హౌ ఆర్‌ యూ అంటూ సీఎం చంద్రబాబును పలకరించిన బిల్‌ గేట్స్‌

    • మంత్రులను బిల్‌ గేట్స్‌కు పరిచయం చేసిన సీఎం చంద్రబాబు

  • Feb 16, 2026 11:29 IST

    AI సమ్మిట్‌.. భారత్ వేగవంతమైన వృద్ధికి నిదర్శనం: ప్రధాని మోదీ

    • ప్రపంచ అభివృద్ధిలో సహకారాన్ని అందించేందుకు భారత్ ముందడుగు: ప్రధాని మోదీ

    • ప్రపంచ దేశాల పురోగతి కోసం కృత్రిమ మేథస్సును వినియోగించుకోవడం మన ఉమ్మడి నిబద్ధతకు నిదర్శనం: మోదీ

  • Feb 16, 2026 11:10 IST

    మహబూబాబాద్: తొర్రూర్ మున్సిపాలిటీ ఎదుట తీవ్ర ఉద్రిక్తత

    • బీఆర్ఎస్-కాంగ్రెస్ వర్గీయుల పరస్పర వ్యతిరేక నినాదాలు

    • దయాకర్ గో బ్యాక్ అంటూ కాంగ్రెస్ నేతల నినాదాలు

    • రెండు వర్గాలను అడ్డుకుంటున్న పోలీసులు

    పూర్తి కథనం

  • Feb 16, 2026 11:06 IST

    బిల్ గేట్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ..

    • అమరావతి: బిల్ గేట్స్‌తో సీఎం చంద్రబాబు, మంత్రులు, అధికారులు భేటీ

    • వర్చువల్‌గా హాజరైన వివిధ శాఖల విభాగాధిపతులు

    • గేట్స్ ఫౌండేషన్ సహకారంతో పలు రంగాల్లో ప్రాజెక్టుల విస్తరణపై చర్చ

    • స్వర్ణాంధ్ర విజన్-2047లో భాగంగా సంస్కరణలపై సీఎం చంద్రబాబు ప్రజెంటేషన్‌

    • మెడ్‌టెక్, డయాగ్నస్టిక్స్ సేవలు, సాంకేతిక సాగు సహా ఇతర ప్రాజెక్టులపై వివరించనున్న సీఎం చంద్రబాబు

    • సంజీవని ప్రాజెక్టుని వివరించనున్న ఏపీ ప్రభుత్వం

  • Feb 16, 2026 11:05 IST

    సీఎం చంద్రబాబు ట్వీట్‌

    • వెల్కమ్‌ బ్యాక్‌ మిస్టర్ బిల్‌గేట్స్‌: సీఎం చంద్రబాబు ట్వీట్‌

    • ఏపీ వెల్కమ్స్‌ యూ అంటూ సీఎం చంద్రబాబు ట్యాగ్‌

  • Feb 16, 2026 11:04 IST

    బిల్‌ గేట్స్‌తో పలు అంశాలపై చర్చలు: మంత్రి లోకేష్ ట్వీట్‌

    • సాంకేతిక ఆధారిత పరిపాలన రంగంలో భాగస్వామ్యాల బలోపేతంపై చర్చ

    • ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు సహకారం: మంత్రి లోకేష్‌

    • గేట్స్ ఫౌండేషన్‌తో సన్నిహితంగా పనిచేయడానికి ఏపీ ఎదురుచూస్తోంది: మంత్రి లోకేష్‌

    • బిల్ గేట్స్‌కు అమరావతి స్వాగతం పలుకుతోంది: మంత్రి లోకేష్ ట్వీట్‌

  • Feb 16, 2026 11:02 IST

    టీ20 ప్రపంచ కప్: టాస్ నెగ్గిన అఫ్గానిస్తాన్

    • ఢిల్లీ: అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా తలపడనున్న అఫ్గానిస్తాన్-యూఏఈ జట్లు

    • టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న అఫ్గానిస్తాన్

    • తొలుత బ్యాటింగ్‌కు దిగనున్న యూఏఈ

  • Feb 16, 2026 10:44 IST

    కుల్దీప్ యాదవ్‌పై హార్దిక్ పాండ్య, సూర్యకుమార్ ఆగ్రహం!

    • భారత్-పాక్ మ్యాచ్ అనంతరం కుల్దీప్ యాదవ్‌పై తీవ్ర వ్యక్తం చేసిన హార్దిక్, సూర్య

    • హార్దిక్ వేసిన ఆఖరి ఓవర్‌లో క్యాచ్ వదిలేయడమే కారణం!

    పూర్తి కథనం

  • Feb 16, 2026 10:11 IST

    ఏపీ సచివాలయానికి బిల్‌ గేట్స్

    • ఏపీ సచివాలయానికి గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ బిల్‌ గేట్స్

    • సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్‌తో భేటీ

    • గేట్స్ ఫౌండేషన్ సహకారంతో చేపట్టిన ప్రాజెక్టులను విస్తరించే అంశంపై చర్చ

  • Feb 16, 2026 09:09 IST

    బిల్‌ గేట్స్‌కు ఘన స్వాగతం

    • విజయవాడ ఎయిర్‌పోర్ట్‌లో బిల్‌ గేట్స్‌కు ఘన స్వాగతం

    • బిల్ గేట్స్ బృందానికి స్వాగతం పలికిన పవన్, లోకేష్‌..

    • మంత్రులు అనిత, సత్యకుమార్‌, అచ్చెన్నాయుడు, దుర్గేష్‌

    పూర్తి కథనం

  • Feb 16, 2026 09:09 IST

    సురక్షితంగా ల్యాండింగ్..

    • విజయవాడ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండైన బిల్‌ గేట్స్‌ విమానం

    • బిల్‌ గేట్స్ విమానానికి ATC క్లియరెన్స్‌

    పూర్తి కథనం

  • Feb 16, 2026 09:07 IST

    నిర్మల్: భైంసా మున్సిపాలిటీలో మారుతున్న సమీకరణాలు

    • MIMకు చెక్‌ పెట్టేందుకు ఒక్కటైన బీజేపీ, కాంగ్రెస్, ఇండిపెండెంట్లు

    • ఎక్స్‌ అఫీషియోతో 15కు చేరిన కూటమి బలం, MIM బలం 12

  • Feb 16, 2026 08:36 IST

    విజయవాడ ఎయిర్‌పోర్ట్‌లో దట్టమైన పొగ మంచు

    • విజయవాడ చుట్టూ చక్కర్లు కొడుతున్న బిల్‌ గేట్స్ విమానం

    • పొగమంచు కారణంగా పూర్ విజిబిలిటీ

  • Feb 16, 2026 08:23 IST

    కరీంనగర్ కార్పొరేషన్‌లో మారిన రాజకీయ సమీకరణాలు

    • కరీంనగర్ మేయర్ ఎన్నికలో BRS హాజరుపై ఉత్కంఠ

    • BRS హాజరుకాకపోతే మేయర్ పీఠం బీజేపీకి దక్కే ఛాన్స్

    • కరీంనగర్ కార్పొరేషన్‌లో మ్యాజిక్ ఫిగర్-31, బీజేపీ బలం 34

  • Feb 16, 2026 08:22 IST

    హైదరాబాద్: కోఠి కాల్పుల కేసులో పురోగతి

    • కాల్పులు జరిపిన ఒకరిని హర్యానాలో పట్టుకున్న పోలీసులు

    • మరొకరి కోసం యూపీ, హర్యానాలో పోలీసుల గాలింపు

    • ఇప్పటికే నిందితులకు ఆశ్రయం ఇచ్చిన పాతబస్తీ వాసి అరెస్ట్

    • గత 3నెలల నుంచి దోపిడీకి ప్లాన్ చేసిన యూపీకి చెందిన నిందితులు

    • కేరళకు చెందిన వ్యాపారవేత్తపై కాల్పులు జరిపి రూ.6లక్షల చోరీ

  • Feb 16, 2026 07:56 IST

    మంచిర్యాల: బెల్లంపల్లి మున్సిపాలిటీలో ఉత్కంఠ

    • కీలకంగా మారిన ఐదుగురు ఇండిపెండెంట్లు, ఇద్దరు బీజేపీ కౌన్సిలర్ల మద్దతు

    • ఎక్స్‌ అఫీషియో ఓటుతో పీఠం కైవసం చేసుకునే ధీమాలో కాంగ్రెస్

    • ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీల్లోనూ ఏ పార్టీకి లేని మెజారిటీ

    • రెండు పీఠాలను దక్కించుకునేందుకు కాంగ్రెస్, BRS ప్రయత్నాలు

  • Feb 16, 2026 07:56 IST

    మెదక్ మున్సిపాలిటీలో చైర్మన్, వైస్ చైర్మన్ పదవులపై ఉత్కంఠ

    • 32 వార్డుల్లో BRS-15, కాంగ్రెస్-14, బీజేపీ 2, బీఎస్పీ-1

    • బీజేపీ మద్దతు కోసం కాంగ్రెస్, BRS ప్రయత్నాలు

  • Feb 16, 2026 07:55 IST

    నేడు తెలంగాణలో మేయర్లు, చైర్మన్ల ఎన్నిక

    • హంగ్ ఏర్పడిన మున్సిపాలిటీల్లో ఉత్కంఠ

    • క్యాంపు రాజకీయాలతో అన్ని పార్టీలు వ్యూహరచన

    • చివరి నిమిషం వరకు పార్టీల ప్రయత్నాలు

  • Feb 16, 2026 07:54 IST

    మంచిర్యాల: కాంగ్రెస్ ఖాతాలో మూడు మున్సిపాలిటీలు

    • లక్షెట్టిపేట, చెన్నూర్, నిర్మల్ మున్సిపాలిటీలు కాంగ్రెస్ కైవసం

    • చైర్మన్, వైస్ చైర్మన్లను ఫైనల్ చేసిన కాంగ్రెస్

    • నిర్మల్ చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా అప్పాల కావ్య,..

    • లక్షెట్టిపేట చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా అంజలి ఖరారు

    • క్యాతనపల్లి మున్సిపాలిటీలో BRS-CPI కూటమిదే పైచేయి

    • చైర్మన్, వైస్ చైర్మన్ పదవులపై క్లారిటీ ఇవ్వని అధిష్టానం

  • Feb 16, 2026 07:06 IST

    హైదరాబాద్‌: గౌలిపురా మార్కెట్‌లో MIM కార్యకర్తలపై దాడి

    • వాహనాన్ని అడ్డుకుని పార్టీ జెండా ధ్వంసం చేసిన దుండగులు

    • కార్యకర్తలపై దాడి చేసి అనంతరం పరారైన గుర్తుతెలియని వ్యక్తులు

  • Feb 16, 2026 07:02 IST

    తిరుపతి: చంద్రగిరి మండలం ఐతేపల్లిలో రోడ్డుప్రమాదం

    • రెండు బైక్‌లు ఢీకొన్న ఘటనలో ఇద్దరి మృతి, మరో ఇద్దరికి గాయాలు

    • బోడిగుట్టపల్లి వాసి భూపాల్ రెడ్డి(28), యల్లంపల్లి వాసి మల్లికార్జున్(24) మృతి

    • మృతదేహాలు తిరుపతి రుయా మార్చురీకి తరలింపు

  • Feb 16, 2026 07:02 IST

    ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం

    • తమిళనాడు, శ్రీలంకలో జోరువానలు

    • ఈనెల 25 నుంచి 28 వరకు తెలంగాణలో తేలికపాటి జల్లులు

  • Feb 16, 2026 07:01 IST

    ఢిల్లీ: నేటి నుంచి AI శిఖరాగ్ర సదస్సు

    • ప్రజలు, భూగోళం, పురోగతి అంశాలపై సదస్సులో చర్చ

    • హాజరుకానున్న ఫ్రాన్స్‌, బ్రెజిల్‌, స్పెయిన్‌ దేశాల అధ్యక్షులు

    • సదస్సుకు హాజరుకానున్న 20 దేశాలకు చెందిన ప్రతినిధులు

  • Feb 16, 2026 07:00 IST

    నేడు అమరావతిలో బిల్ గేట్స్ పర్యటన

    • పలు కార్యక్రమాలకు హాజరుకానున్న బిల్‌ గేట్స్‌

    • RTGS కేంద్రాన్ని సందర్శించనున్న బిల్‌ గేట్స్‌