శ్రీశైలం ఘాట్ రోడ్డులో ఆర్టీసీ బస్సుకు తప్పిన పెను ప్రమాదం
ABN , Publish Date - Feb 16 , 2026 | 05:09 PM
దోర్నాల–శ్రీశైలం ఘాట్ రోడ్డులో పెను ప్రమాదం తప్పింది. చింతల సమీపంలో ఆర్టీసీ బస్సు బ్రేక్ ఫెయిల్ కావడంతో కొండను ఢీకొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో 62 మంది ప్రయాణికులు ఉండగా.. అదృష్టవశాత్తూ అంతా స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
మార్కాపురం: దోర్నాల–శ్రీశైలం ఘాట్ రోడ్డులో పెద్ద ప్రమాదం తప్పింది. చింతల సమీపంలో బ్రేక్ ఫెయిల్ కావడంతో ఆర్టీసీ బస్సు కొండను ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 62 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. అయితే అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. పెద్ద ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఈ బస్సు శ్రీశైలం నుండి డోన్ వైపు వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ఘాట్ రోడ్డులో మలుపు వద్ద బ్రేకులు పనిచేయకపోవడంతో డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి బస్సును కొండ వైపు మళ్లించడం వల్ల పెద్ద ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది. గమనించిన స్థానికులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని ప్రయాణికులకు సహాయం చేశారు. అనంతరం అధికారులకు సమాచారం అందించారు.
ఇవి కూడా చదవండి...
గేట్స్ ఫౌండేషన్‌తో భాగస్వామ్యానికి ఏపీ సిద్ధం: మంత్రి లోకేశ్
చంద్రబాబును చూడగానే.. బిల్ గేట్స్ ఏమన్నారో తెలుసా
Read Latest AP News And Telugu News