రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. ఏపీ సీఎంతో తుమ్మల భేటీ
ABN , Publish Date - Feb 16 , 2026 | 07:24 PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇవాళ(సోమవారం) సమావేశం అయ్యారు. ఈభేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు. ప్రధానంగా పునర్విభజనలో ఆంధ్రాలో కలిసిన 5 గ్రామపంచాయతీలను తిరిగి తెలంగాణలో కలపడానికి సహకరించాలని మంత్రి తుమ్మల కోరారు.
అమరావతి, ఫిబ్రవరి16 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో (AP CM Chandrababu Naidu) మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Thummala Nageswara Rao) ఇవాళ(సోమవారం) అమరావతిలో సమావేశం అయ్యారు. ఈభేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు. ప్రధానంగా పునర్విభజనలో ఆంధ్రాలో కలిసిన 5 గ్రామపంచాయతీలను తిరిగి తెలంగాణలో కలపడానికి సహకరించాలని మంత్రి తుమ్మల కోరారు. తిరుమలలో తెలంగాణకి 5 ఎకరాల స్థలం కేటాయించాలని సీఎం చంద్రబాబుని తుమ్మల కోరారు.
ఖమ్మంలో టీటీడీ దేవస్థానం నిర్మాణానికి సహకరించాలని సీఎం చంద్రబాబును మంత్రి తుమ్మల కోరారు. ఖమ్మం జిల్లా పెద్దవాగు మరమ్మత్తుల కోసం అయ్యే ఖర్చులో 85శాతం నిధులను విడుదల చేయాలని అభ్యర్థించారు. అదేవిధంగా సత్తుపల్లి, కొవ్వూరు రైల్వేలైన్, పెనుబల్లి, అమరావతి రైల్వేలైన్ నిర్మాణానికి కృషి చేయాలని విన్నవించారు. భద్రాచలం ముంపు బారిన పడకుండా నిర్మించిన కరకట్టకి సంబంధించి.. ఏపీలో కలిసిన భాగానికి వెంటనే మరమ్మతులు చేపట్టాలని మంత్రి తుమ్మల కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏపీ ప్రభుత్వంపై బిల్‌గేట్స్ ప్రశంసలు..
ఏపీ అభివృద్ధికి గేట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యం కీలక మలుపు: పవన్ కల్యాణ్
Read Latest Telangana News And AP News And Telugu News