Share News

కృష్ణా జిల్లాలో దారుణం… నాలుగేళ్ల చిన్నారిపై..

ABN , Publish Date - Feb 16 , 2026 | 09:25 PM

కృష్ణా జిల్లా పెదపారుపూడి మండలంలో అమానుష ఘటన వెలుగుచూసింది. నాలుగేళ్ల బాలికపై.. వరసకు పెదనాన్న అయ్యే వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు.

కృష్ణా జిల్లాలో దారుణం… నాలుగేళ్ల చిన్నారిపై..
Pedaparupudi Child Incident

కృష్ణా జిల్లా పామర్రు , ఫిబ్రవరి16 (ఆంధ్రజ్యోతి): పెదపారుపూడి మండలంలో నాలుగేళ్ల బాలికపై దారుణం జరిగింది. బాలిక కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పెదనాన్న వరసయ్యే వ్యక్తే లైంగిక దాడికి పాల్పడినట్లు బాలిక కుటుంబ సభ్యులు గుర్తించారు. వారి ఫిర్యాదు మేరకు.. పెదపారుపూడి పోలీసులు చర్యలు చేపట్టారు.


లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిపై ఫోక్సో (POCSO) చట్టం క్రింద కేసు నమోదు చేశారు. గుడివాడ డీఎస్పీ ధీరజ్ వినిల్ మీడియాకు వివరాలు వెల్లడించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని, దర్యాప్తును వేగవంతం చేసి బాధితురాలికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం పోలీసులు సాక్ష్యాధారాలను సేకరిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఏపీ ప్రభుత్వంపై బిల్‌గేట్స్ ప్రశంసలు..

ఏపీ అభివృద్ధికి గేట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యం కీలక మలుపు: పవన్ కల్యాణ్

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Feb 16 , 2026 | 09:35 PM