Share News

డోర్నకల్ మున్సిపాలిటీలో ట్విస్ట్..

ABN , Publish Date - Feb 16 , 2026 | 02:37 PM

మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మున్సిపాలిటీ ఎన్నిక చివరి నిమిషంలో ట్విస్ట్ చోటుచేసుకుంది. ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్ కౌన్సిలర్లు గైర్హాజరు కావడంతో అధికారులు వాయిదా వేశారు.

డోర్నకల్ మున్సిపాలిటీలో ట్విస్ట్..
Dornakal Municipality Election

మహబూబాబాద్ జిల్లా: డోర్నకల్ మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలో చివరి నిమిషంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ కౌన్సిలర్లు హాజరుకాకపోవడంతో ఎన్నిక ప్రక్రియ నిలిచిపోయింది. నిర్దేశించిన సమయానికి అవసరమైన కోరం లేకపోవడంతో ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయడానికి అవసరమైన సంఖ్యలో కౌన్సిలర్లు లేకపోవడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.


కాంగ్రెస్ కౌన్సిలర్లు ఎన్నికలకు దూరంగా ఉండడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. చైర్మన్, వైస్ చైర్మన్ పదవుల విషయంలో కాంగ్రెస్ పార్టీలో ఏకాభిప్రాయం కుదరకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామంతో డోర్నకల్ మున్సిపాలిటీలో ఉత్కంఠ నెలకొంది. ఎన్నికను ఎప్పుడు నిర్వహిస్తారన్న విషయంపై అధికారులు త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.


ఇదిలా ఉంటే.. సంగారెడ్డిలోని ఇంద్రేశం, జహీరాబాద్ మున్సిపాలిటీల్లో కూడా చైర్మన్, వైస్ చైర్మన్‌ల ఎన్నిక వాయిదా పడింది. కోరం లేక రేపటికి వాయిదా వేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

చైర్మన్ ఎన్నిక వేళ.. ఇస్నాపూర్‌లో బిగ్ ట్విస్ట్

హస్తం ఖాతాలో నిజామాబాద్ మేయర్‌ పీఠం

For More TG News And Telugu News

Updated Date - Feb 16 , 2026 | 03:17 PM