Share News

హస్తం ఖాతాలో నిజామాబాద్ మేయర్‌ పీఠం

ABN , Publish Date - Feb 16 , 2026 | 01:15 PM

నిజామాబాద్‌ నగర మేయర్ పీఠం ఎవరికి దక్కుతుందనే దానిపై ఏర్పడిన ఉత్కంఠ ఎట్టకేలకు సోమవారం వీడింది. నిజామాబాద్ మేయర్ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది.

హస్తం ఖాతాలో నిజామాబాద్ మేయర్‌ పీఠం

నిజామాబాద్, ఫిబ్రవరి 10: నిజామాబాద్‌ నగర మేయర్ పీఠం ఎవరికి దక్కుతుందనే దానిపై ఏర్పడిన ఉత్కంఠ ఎట్టకేలకు సోమవారం వీడింది. నిజామాబాద్ మేయర్ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఆ నగర మేయర్‌గా ఉమారాణిని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎంపిక చేసింది. నిజామాబాద్‌‌ నగరంలో మొత్తం 60 డివిజన్లు ఉన్నాయి. తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో నగర ఓటరు బీజేపీకి 28, కాంగ్రెస్‌కు 17, ఎంఐఎంకు 14, బీఆర్ఎస్ పార్టీకు 1 కట్టబెట్టాడు. అయితే మేయర్ పీఠం దక్కాలంటే.. మ్యాజిక్ ఫిగర్ 31 రావాల్సి ఉంటుంది. అంటే.. మ్యాజిక్ ఫిగర్‌కు మూడు అడుగుల దూరంలో బీజేపీ నిలిచిపోయింది.


అలాంటి వేళ.. మేయర్ పీఠం కోసం అధికార కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేపట్టింది. దాంతో ఎంఐఎంను తన దారికి తెచ్చుకొంది. దాంతో ఈ రెండు పార్టీలు కలిస్తే.. 31 సీట్లు వచ్చినట్లు అయింది. అలాగే ఎక్స్ అఫీషియో సభ్యుల ఓట్లు కూడా కలిసి.. మరో రెండు ఓట్లు ఆ పార్టీకి వచ్చి చేరాయి. అలాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఒక్క అభ్యర్థి సైతం కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిపోయాడు. దాంతో ఈ పీఠం సులువుగా కాంగ్రెస్ పార్టీ ఖాతాలో పడింది. అదీకాక పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సొంత జిల్లా కావడంతో.. నిజామాబాద్ నగర మేయర్ పీఠాన్ని ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దాంతో ఆ పీఠం కాంగ్రెస్ పార్టీ హస్తగతం చేసుకుంది.


ఈ వార్తలు కూడా చదవండి..

చైర్మన్ ఎన్నిక వేళ.. ఇస్నాపూర్‌లో బిగ్ ట్విస్ట్

మున్సిపల్ ఎన్నికలు.. చైర్మన్లు, మేయర్ల ఎన్నికపై నెలకొన్న ఉత్కంఠ

For More TG News And Telugu News

Updated Date - Feb 16 , 2026 | 02:05 PM