కేసీఆర్, కేటీఆర్‌లను సీఎం రేవంత్ ఎందుకు కాపాడుతున్నారో అర్థమైంది: ఎంపీ అర్వింద్
ABN , Publish Date - Feb 16 , 2026 | 01:49 PM
నిజామాబాద్ నగర మేయర్ పీఠం కాంగ్రెస్ పార్టీ చేజిక్కించుకోవడంతో స్థానిక ఎంపీ, బీజేపీ సీనియర్ నేత ధర్మపురి అర్వింద్ స్పందించారు.
నిజామాబాద్, ఫిబ్రవరి 16: నిజామాబాద్ నగర మేయర్ పీఠం కాంగ్రెస్ పార్టీ చేజిక్కించుకోవడంతో స్థానిక ఎంపీ, బీజేపీ సీనియర్ నేత ధర్మపురి అర్వింద్ సోమవారం స్పందించారు. మూడు ఓట్ల తేడాతో మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను కాంగ్రెస్ పార్టీ గెల్చుకుందన్నారు. బీజేపీని ఓడించేందుకు బీఅర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు ఒకటయ్యాయని మండిపడ్డారు కాళేశ్వరం, ఈ కార్ రేసింగ్ తదితర కేసుల్లో బీఆర్ఎస్ పార్టీ అధినేతలు కేసీఆర్, కేటీఆర్‌లను సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు కాపాడుతున్నారో ఈ రోజు అర్థమైందమన్నారు.
ఇందూరులో బీజేపీని ఓడించడానికి అనైతిక పొత్తుకు శ్రీకారం చుట్టారంటూ వారిపై నిజామాబాద్ ఎంపీ అర్వింద్ నిప్పులు చెరిగారు. బీజేపీ ఓటమిలో కాంగ్రెస్ రంగు పూసుకుని తిరిగే పోలీసుల హస్తం కూడా ఉందని ఈ సందర్భంగా ఆరోపించారు. ఈ ఐదేళ్ల పదవి పూర్తయ్యే లోపు ఈ ఫలితాన్ని రివర్స్ చేసి చూపిస్తామని ఆయన శపథం చేశారు. అయితే ఈ మున్సిపల్ ఎన్నికల్లో నైతిక విజయం తమదేనని ప్రకటించారు. ఈ టర్మ్ అయ్యేలోపు కార్పొరేషన్‌ను బీజేపీ కైవసం చేసుకుంటుందని ఎంపీ అర్వింద్ స్పష్టం చేశారు.
అసలు ఏం జరిగిందంటే..?
ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో నిజామాబాద్ నగర పాలక సంస్థలో బీజేపీ 28 సీట్లు కైవసం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ 17, ఎంఐఎం 14, బీఆర్ఎస్ పార్టీ 1 గెలుచుకున్నాయి. నగర మేయర్ పీఠం దక్కాలంటే.. మ్యాజిక్ ఫిగర్ 31 రావాల్సి ఉంటుంది. అంటే.. మ్యాజిక్ ఫిగర్‌కు మూడు అడుగుల దూరంలో బీజేపీ నిలిచిపోయింది. అలాంటి వేళ అధికార కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. ఎంఐఎంను తమ దారికి తెచ్చుకున్నారు. అలాగే బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఒక అభ్యర్థి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దాంతో నిజామాబాద్ మేయర్ పీఠం కాంగ్రెస్ పార్టీ ఖాతాలో పడింది. దాంతో నగర మేయర్‌గా ఉమారాణి పేరును ఖరారు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
చైర్మన్ ఎన్నిక వేళ.. ఇస్నాపూర్‌లో బిగ్ ట్విస్ట్
హస్తం ఖాతాలో నిజామాబాద్ మేయర్ పీఠం
For More TG News And Telugu News