Share News

విమాన టికెట్ల ధరలపై కేంద్రం దృష్టి.. ప్రయాణికులకు ఉపశమనం కల్పిస్తాం: రామ్మోహన్ నాయుడు

ABN , Publish Date - Mar 21 , 2026 | 03:42 PM

పశ్చిమాసియా యుద్ధ పరిస్థితులు విమానయానరంగంపై ప్రభావం చూపుతున్నాయని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యానించారు. విమాన టికెట్ల ధరల పెరుగుదల విషయంలో ప్రయాణికులపై భారం పడకుండా ఉండేలా చర్చిస్తున్నామని తెలిపారు.

విమాన టికెట్ల ధరలపై కేంద్రం దృష్టి.. ప్రయాణికులకు ఉపశమనం కల్పిస్తాం: రామ్మోహన్ నాయుడు
Kinjarapu Ram Mohan Naidu

విశాఖపట్నం, మార్చి 21(ఆంధ్రజ్యోతి): పశ్చిమాసియా యుద్ధ పరిస్థితులు విమానయానరంగంపై ప్రభావం చూపుతున్నాయని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు (Kinjarapu Ram Mohan Naidu) వ్యాఖ్యానించారు. విమాన టికెట్ల ధరల పెరుగుదల విషయంలో ప్రయాణికులపై భారం పడకుండా ఉండేలా చర్చిస్తున్నామని తెలిపారు. ఈరోజు(శనివారం) విశాఖపట్నంలో రామ్మోహన్ నాయుడు పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. సరిహద్దుల విషయంలో చర్చలు జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు. రైల్వేజోన్ ప్రధాన కార్యాలయం నిర్మాణం జరుగుతుందని.. జీఎమ్‌ను నియమించారని అన్నారు.


దక్షిణ కోస్తా రైల్వే జోన్‌పై దృష్టి..

కొత్తవలస - కిరండూల్(కేకే) రైల్వేలైన్‌ కోసం ఇంకా చర్చ జరుగుతోందని రామ్మోహన్ నాయుడు తెలిపారు. జగన్ హయాంలో రైల్వేజోన్ కార్యాలయ నిర్మాణానికి భూమి కేటాయించలేదని ప్రస్తావించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే దక్షిణ కోస్తా రైల్వే జోన్‌పై దృష్టి సారించామని పేర్కొన్నారు. ఎయిర్‌పోర్టును జూన్ చివరి నాటికి ప్రారంభించేందుకు చర్యలు చేపట్టామని అన్నారు. విమానాశ్రయం ప్రారంభించే నాటికి రోడ్డు కనెక్టివిటీ పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. సీఐఐ వార్షిక సమావేశంలో పాల్గొనటం ఆనందంగా ఉందని తెలిపారు. సీఐఐపై సీఎం చంద్రబాబుకు అపారమైన నమ్మకం ఉందని ఉద్ఘాటించారు. విజన్ 2047 అమల్లో సీఐఐ ముఖ్య భూమిక పోషిస్తుందని తెలిపారు.


మా ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం, విశ్వాసం పెరిగింది..

విశాఖ వేదికగా నిర్వహించిన సీఐఐ భాగస్వామ్య సదస్సు విజయవంతమైందని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల్లో నమ్మకం, విశ్వాసం పెరిగిందని తెలిపారు. ఈనెల 23వ తేదీన మిట్టల్ స్టీల్ ప్లాంట్‌కు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేస్తున్నారని అన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం త్వరలో ప్రారంభం అవుతుందని తెలిపారు. అనేక పెద్ద సంస్థలు సీఎం చంద్రబాబుపై నమ్మకంతో రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెడుతున్నాయని వెల్లడించారు. సూపర్ సిక్స్ పథకాలకు ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తోందని తెలిపారు. ఉగాది రోజు జాబ్ క్యాలెండర్‌ను మంత్రి లోకేశ్ విడుదల చేశారని ప్రస్తావించారు. కూటమి హయాంలో ఉత్తరాంధ్ర అభివృద్ధి జరుగుతుందని చెప్పుకొచ్చారు. జిల్లా, మండల స్థాయిలో సీఐఐ సదస్సులు నిర్వహించాలని రామ్మోహన్ నాయుడు సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అకాల వర్షాలతో పంట దెబ్బతిన్న రైతన్నలను ఆదుకుంటాం: సీఎం చంద్రబాబు

దేవుడి సాక్షిగా నేను రాసినవన్నీ నిజాలే.. వైఎస్ విజయలక్ష్మి షాకింగ్ కామెంట్స్

‘ఆస్కార్’ రేంజ్‌లో అవినాశ్‌ ప్రెస్‌మీట్.. బీటెక్ రవి సెటైర్లు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Mar 21 , 2026 | 03:52 PM