Share News

సాయంత్రం 6.30 గంటలకు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు

ABN , Publish Date - Apr 29 , 2026 | 04:50 PM

పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ బుధవారం సాయంత్రం 6 గంటలకు ముగియనుండటంతో అందరి దృష్టి ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్‌పై పడింది. బెంగాల్‌తో పాటు ఇప్పటికే ముగిసిన తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరి ఎగ్జిట్ పోల్స్‌ ఫలితాలు సాయంత్రం 6.30 గంటలకు వెలువడనున్నాయి.

సాయంత్రం 6.30 గంటలకు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు
Exit polls five states

న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ బుధవారం సాయంత్రం 6 గంటలకు ముగియనుండటంతో అందరి దృష్టి ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్‌పై పడింది. బెంగాల్‌తో పాటు ఇప్పటికే ముగిసిన తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరి ఎగ్జిట్ పోల్స్‌ ఫలితాలు సాయంత్రం 6.30 గంటలకు వెలువడనున్నాయి. పలు ప్రధాన న్యూస్ ఛానెల్స్ ఇందుకు సంబంధించి లైవ్ ఇచ్చేందుకు సిద్ధపడుతున్నాయి. ఆయా రాష్ట్రాల్లో గెలుపు అంచనాలను వివిధ సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్‌లో వెల్లడిస్తాయి. అయితే ప్రజలు నిజానికి ఎవరికి పట్టం కట్టారనేది మే 4న జరిగే ఓట్ల లెక్కింపులోనే తేలుతుంది.


కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో ఏప్రిల్ 9న ఒకే విడతలో పోలింగ్ జరిగింది. తమిళనాడులో ఏప్రిల్ 23న పోలింగ్ ముగిసింది. పశ్చిమ బెంగాల్ ఎన్నికలు ఏప్రిల్ 23, 29 తేదీల్లో రెండు విడతలుగా నిర్వహించారు. దీంతో 29వ తేదీ సాయంత్రం 6.30 గంటల వరకూ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడిపై ఈసీ నిషేధం ఉంది. టైమ్స్ నౌ, టైమ్స్ ఆఫ్ ఇండియా, ఎన్డీటీవీ,ఇండియా టుడే తదతర ప్రధాన ఛానెళ్లు ఎగ్జిట్ పోల్ ఫలితాలను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాయి.


భారీ పోలింగ్

నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఈసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేనివిధంగా పోలింగ్ శాతం నమోదైంది. తమిళనాడులో 84 శాతం పోలింగ్ నమోదు కాగా, అస్సాంలో 85.5 శాతం, కేరళలో 78, పుదుచ్చేరిలో 89.87 శాతం పోలింగ్ నమోదైనట్టు గణాంకాలు చెబుతున్నాయి. బెంగాల్ తొలి విడతలో 92 శాతం పోలింగ్ నమోదైంది.


ఇవి కూడా చదవండి..

మే 4న ఐదు రాష్ట్రాల్లో గెలిచి హ్యాట్రిక్ సాధిస్తాం: మోదీ

సువేందును చుట్టుముట్టిన టీఎంసీ మద్దతుదారులు.. స్పల్ప లాఠీచార్జి

Updated Date - Apr 29 , 2026 | 05:28 PM