Share News

మే 4న ఐదు రాష్ట్రాల్లో గెలిచి హ్యాట్రిక్ సాధిస్తాం: మోదీ

ABN , Publish Date - Apr 29 , 2026 | 02:48 PM

బిహార్ అసెంబ్లీ ఎన్నికలు, గుజరాత్ మున్సిపల్ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన బీజేపీ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ గెలిచి హ్యాట్రిక్ సాధించనుందని ప్రధాని ధీమా వ్యక్తం చేశారు.

మే 4న ఐదు రాష్ట్రాల్లో గెలిచి హ్యాట్రిక్ సాధిస్తాం: మోదీ
PM Modi

హర్దోయీ: పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్‌లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారని, గత ఎన్నికల తరహాలో కాకుండా ఎలాంటి భయాలు లేని వాతావరణంలో ప్రజలు తమ ఓటుహక్కును వినియోగించుకుంటున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రజాస్వామ్య పటిష్టతకు ఇది సంకేతమని తెలిపారు. ప్రజాస్వామ్య పండుగలో ప్రజలంతా ఉత్సాహంతో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. మే 4న ఐదు రాష్ట్రాలలో బీజేపీ గెలిచి హాట్రిక్ సాధించనుందని ధీమా వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని హోర్దోయీలో 'గంగా ఎక్స్‌ప్రెస్‌వే'ను ప్రధాని బుధవారంనాడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన బెంగాల్‌లో జరుగుతున్న పోలింగ్‌ను ప్రస్తావించారు.


'బెంగాల్‌లో ప్రస్తుతం రెండో విడత పోలింగ్ జరుగుతోంది. ఓటర్లు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నట్టు తెలుస్తోంది. మొదటి విడతలో మాదిరిగానే ప్రజలు పెద్దఎత్తున ఓటింగ్‌లో పాల్గొంటున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద భారీ క్యూలు కనిపిస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. గత ఆరేడు దశాబ్దాల్లో ఎవరూ ఊహించని విధంగా భయరహిత వాతావరణంలో ఓటింగ్ జరుగుతోంది. ఓటింగ్ ముగియడానికి మరికొద్ది గంటలే ఉన్నాయి. ప్రజలు ఇదే ఉత్సాహంతో ప్రజాస్వామ్య పండుగలో పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరుతున్నాను' అని మోదీ అన్నారు.


బిహార్ అసెంబ్లీ ఎన్నికలు, గుజరాత్ మున్సిపల్ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన బీజేపీ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ గెలిచి హ్యాట్రిక్ సాధించనుందని ప్రధాని ధీమా వ్యక్తం చేశారు. మే 4న ఫలితాలతో అభివృద్ధి భారత్ సంకల్పానికి మరింత బలం చేకూరనుందని చెప్పారు.


ఇవి కూడా చదవండి..

గంగా ఎక్స్‌ప్రెస్‌‌‌వే యూపీ అభివృద్ధికి కొత్త జీవన రేఖ: మోదీ

మమతా మేనల్లుడి ఇలాకాలో కలకలం.. బీజేపీ గుర్తుపై టేపు..

Updated Date - Apr 29 , 2026 | 03:29 PM