Share News

మమతా మేనల్లుడి ఇలాకాలో కలకలం.. బీజేపీ గుర్తుపై టేపు..

ABN , Publish Date - Apr 29 , 2026 | 12:24 PM

తుది దశ ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ అక్రమాలకు పాల్పడుతోందని బీజేపీ ఆరోపిస్తోంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, లోక్‌సభ ఎంపీ అభిషేక్ బెనర్జీకి బలమైన పట్టున్న ప్రాంతంలోని పోలింగ్ కేంద్రాలలో అక్రమాలు జరుగుతున్నాయి అంటోంది.

మమతా మేనల్లుడి ఇలాకాలో కలకలం.. బీజేపీ గుర్తుపై టేపు..
BJP vs TMC controversy

కోల్‌కతా, ఏప్రిల్ 29: పశ్చిమ బెంగాల్‌లో బుధవారం తుది దశ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. తుది దశ ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ అక్రమాలకు పాల్పడుతోందని బీజేపీ ఆరోపిస్తోంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, లోక్‌సభ ఎంపీ అభిషేక్ బెనర్జీకి బలమైన పట్టున్న ప్రాంతంలోని పోలింగ్ కేంద్రాలలో అక్రమాలు జరుగుతున్నాయి అంటోంది.

west bengal.jpg


బీజేపీ మీడియా ఇన్‌ఛార్జ్ అమిత్ మాల్వియా మీడియాతో మాట్లాడుతూ.. ‘డైమండ్ హార్బర్ పరిధిలోని ఫాల్టాలో ఉన్న పలు పోలింగ్ కేంద్రాల్లో బీజేపీ గుర్తుపై టేపు అతికించారు. ఓటర్లు బీజేపీకి ఓటు వేయకుండా చేస్తున్నారు. తృణమూల్ చెబుతున్న ‘డైమండ్ హార్బర్ మోడల్’ ఇదే కావచ్చు. ఈ పద్ధతిలోనే మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ లోక్‌సభ ఎన్నికల్లో గెలిచారు. తృణమూల్ మోసాలకు పాల్పడుతున్న పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ జరిపించాల్సిందే’ అని అన్నారు. బీజేపీ ఆరోపణలను తృణమూల్ పార్టీ ఖండించింది. ఎలక్షన్ కమిషన్, పోలీస్ అబ్జర్వర్ అజయ్ పాల్ శర్మ వైఫల్యం కారణంగానే అలా జరిగిందని అంది.


తృణమూల్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి రిజు దత్తా మాట్లాడుతూ.. ‘అజయ్ పాల్ శర్మ ఫాల్టాలో తిరుగుతున్నారు. మా పార్టీ అభ్యర్థులను వారి కుటుంబసభ్యులను భయపెడుతున్నారు. సీఆర్‌పీఎఫ్ డీజీ మిస్టర్ సింగ్ ప్రస్తుతం డైమండ్ హర్బర్‌లోనే ఉన్నారు. మొత్తం వ్యవహారం ఎన్నికల కమిషన్ పరిధిలోనే ఉంది. అమిత్ మాల్వియా ట్వీట్లు చేయడం మానేసి.. జ్ఞానేష్ కుమార్‌ను వెంటనే తొలగించమని, అజయ్ పాల్ శర్మను సస్పెండ్ చేయమని తన బాస్‌లకు ఫిర్యాదు చేయాలి. ఎందుకంటే బీజేపీ కోరుకున్న ఫలితాలను వారు అందించలేకపోయారు. మేము సరైన అధికారులకు ఫిర్యాదు చేస్తున్నాం. వారు కూడా అదే పని చేయాలి. మమతా బెనర్జీపై తమ శక్తినంతా ప్రయోగించి కూడా దారుణంగా ఓడిపోతున్నారు. అందుకే వారు ఇలా అబద్ధపు ఆరోపణలు చేస్తున్నారు’ అని అన్నారు.


ఇవి కూడా చదవండి

మంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ చెప్పలేదు.. నేను అడగలేదు: కోదండరాం

ఒపెక్ నుంచి యూఏఈ నిష్క్రమణ.. పాక్-సౌదీ స్నేహం కూడా ఒక కారణమా..

Updated Date - Apr 29 , 2026 | 12:47 PM