మంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ చెప్పలేదు.. నేను అడగలేదు: కోదండరాం
ABN , Publish Date - Apr 29 , 2026 | 12:10 PM
ప్రజల నుంచి దూరంగా ఉంటే ఏ పార్టీ అయినా బతకదని, అందుకే కేసీఆర్ ఇప్పుడు బయటకు వస్తున్నారని ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ‘మేం సరిగ్గానే ఉన్నాం.. ప్రజలే మారాలని కేసీఆర్ ఆలోచిస్తున్నారు’ అని వ్యాఖ్యానించారు.
హైదరాబాద్, ఏప్రిల్ 29: కాంగ్రెస్ పార్టీ తనకు మంత్రి పదవి ఇస్తానని చెప్పలేదని.. తాను అడగలేదని ప్రొఫెసర్ కోదండరాం స్పష్టం చేశారు. బుధవారం మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడుతూ.. ‘మేము ప్రభుత్వ పదవులు, నామినేటెడ్ పోస్టులు కావాలని అడుగుతున్నాం. ఈసారి మా పార్టీ నేతలకు నామినేటెడ్ పోస్టులు ఇస్తారని నమ్ముతున్నాం’ అని అన్నారు. ‘గత ప్రభుత్వంలో ఎవరినైనా కలవాలంటే భయపడే పరిస్థితి ఉండేది. ఇంట్లోనే ఫోన్ పెట్టి, జాగ్రత్తగా రమ్మని చెప్పేవాళ్లు. భయం అంటే ఏంటో గత ప్రభుత్వం చూపించింది’ అని విమర్శించారు.
అమరుల స్ఫూర్తి యాత్రకు కూడా పర్మిషన్ ఇవ్వలేదని కోదండరాం గుర్తు చేశారు. ప్రజల నుంచి దూరంగా ఉంటే ఏ పార్టీ అయినా బతకదని, అందుకే కేసీఆర్ ఇప్పుడు బయటకు వస్తున్నారని అన్నారు. ‘మేం సరిగ్గానే ఉన్నాం. ప్రజలే మారాలని కేసీఆర్ ఆలోచిస్తున్నారు’ అని వ్యాఖ్యానించారు. కుటుంబ లోపాలను కవిత బయటపెడుతున్నారని అన్నారు. పార్టీ అంటే కుటుంబమే అని కవిత చెప్పకుండానే చెబుతున్నట్లు ఉందని అన్నారు. ఓట్లు, సీట్లు కావాలంటే పార్టీని వేరేలా నడపాలని.. తాము మార్పు కోసమే పార్టీని నడుపుతున్నామని స్పష్టం చేశారు. అన్ని ఎన్నికల్లోనూ పోటీ చేయకుండా ఉండలేమని, ఈసారి కచ్చితంగా ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. ముందు నుంచే నియోజకవర్గాలను ఎంచుకుని పని చేస్తామన్నారు. ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉండాలని కోరుకుంటున్నట్లు కోదండరాం తెలిపారు.
ఇవి కూడా చదవండి..
ఏపీ పదో తరగతి ఫలితాలు రేపే.. ఉదయం 11 గంటలకు విడుదల
ప్రత్యర్థి పార్టీ కుట్రలకు ఇక కాలం చెల్లింది: సీఎం చంద్రబాబు
Read Latest Telangana News And Telugu News