Share News

ఏపీ పదో తరగతి ఫలితాలు రేపే.. ఉదయం 11 గంటలకు విడుదల

ABN , Publish Date - Apr 29 , 2026 | 10:50 AM

ఏపీలో పదో తరగతి పరీక్ష ఫలితాలు ఏప్రిల్ 30న విడుదలకానున్నాయి. ఈ మేరకు విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ సోషల్ మీడియా ఎక్స్‌ ఖాతాలో పోస్ట్ చేశారు.

ఏపీ పదో తరగతి ఫలితాలు రేపే.. ఉదయం 11 గంటలకు విడుదల
AP 10th Results

అమరావతి, ఏప్రిల్ 29: ఏపీలో పదో తరగతి పరీక్ష ఫలితాలు రేపు (ఏప్రిల్ 30) విడుదలకానున్నాయి. ఈ మేరకు విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్.. ఎక్స్‌ ఖాతాలో పోస్ట్ చేశారు. రేపు ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదలవుతాయని మంత్రి వెల్లడించారు. స్కూల్ లాగిన్ ద్వారా హెడ్ మాస్టర్లు నేరుగా మార్కుల మెమోలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించారు.


విద్యార్థులు తమ ఫలితాలను results.bse.ap.gov.in సైట్‌లో చూసుకోవచ్చని మంత్రి తెలిపారు. అలాగే మనమిత్ర వాట్సాప్ నంబర్ 9552300009‌కు ‘హాయ్’ మెసేజ్ చేసి ఫలితాలను చూడవచ్చన్నారు. లీప్ యాప్ ద్వారా కూడా విద్యార్థులు తమ రిజల్ట్స్‌ను తెలుసుకోవచ్చని మంత్రి లోకేశ్ వెల్లడించారు.


ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 6.30 లక్షల మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాశారు. మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు పది పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల ఫలితాల కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫలితాలు విడుదలైన వెంటనే అధికారిక వెబ్‌సైట్లలో హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి చెక్ చేసుకోవచ్చు.


ఇవి కూడా చదవండి..

బెంగళూరులో శ్రీహరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

ఆస్తి కోసం కూతురు ఎంతకు తెగించిందంటే..

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 29 , 2026 | 11:16 AM