Share News

ఇంటి గొడవల వల్లే కవిత కొత్త పార్టీ

ABN , Publish Date - Apr 29 , 2026 | 09:29 AM

ఇంటి గొడవ వల్లే కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పెట్టిందని ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ అన్నారు.

ఇంటి గొడవల వల్లే కవిత కొత్త పార్టీ
Danam Nagender

  • త్వరలోనే ప్రతీ నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు

  • ఖైరాతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌

హైదరాబాద్: ఇంటి గొడవ వల్లే కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పెట్టిందని ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తోందని కల్వకుంట కవిత వ్యాఖ్యానించడాన్ని ఆయన తప్పుబట్టారు. మంగళవారం ఆదర్శ్‌నగర్‌ ఓల్డ్‌ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో జరిగిన కార్యక్రమంలో పలువురు లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కులను తహసీల్దార్లతో కలిసి అందజేశారు. మరికొందరికి సీఎంఆర్‌ఎఫ్‌ ఎల్‌వోసీలను అందజేశారు. ఈ సందర్భంగా దానం మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీతోనే తెలంగాణ దేశంలోనే ఆదర్శంగా నడుస్తోందని కవిత గుర్తించాలన్నారు.


city5.2.jpgసొంత తండ్రిని రోబోలా అభివర్ణించిన కవిత... తన ఇంటి తగాదాల వల్లే కొత్త పార్టీ పెట్టారని విమర్శించారు. త్వరలోనే ప్రతీ నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లను ఇవ్వనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్‌లతో పాటు మాజీ కార్పొరేటర్లు మామిడి నర్సింగ్‌రావు, వనం సంగీత యాదవ్‌, నాయకులు రామన్‌గౌడ్‌, వైల ప్రవీణ్‌ కుమార్‌, రమణగౌడ్‌, శ్రీనివాస్‏గౌడ్‌, ఆంథోని, రవి, సర్పరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

మళ్లీ నిలిచిన మంజీరా జలాల తరలింపు

సరదాగా వెళ్లి.. ప్రాణాలు కోల్పోయి..

Read Latest Telangana News and National News

Updated Date - Apr 29 , 2026 | 09:29 AM