సరదాగా వెళ్లి.. ప్రాణాలు కోల్పోయి..
ABN , Publish Date - Apr 29 , 2026 | 07:32 AM
పాఠశాలలకు సెలవులు రావడంతో మేనల్లుడిని సరదాగా కారులో తిప్పడానికి వెళ్లి, తిరిగి వస్తుండగా జరిగిన ప్రమాదంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ప్రాణాలు కోల్పోయాడు.
రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి
హైదరాబాద్: పాఠశాలలకు సెలవులు రావడంతో మేనల్లుడిని సరదాగా కారులో తిప్పడానికి వెళ్లి, తిరిగి వస్తుండగా జరిగిన ప్రమాదంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ప్రాణాలు కోల్పోయాడు. అతని మేనల్లుడు తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దుండిగల్ పోలీసుల వివరాల ప్రకారం. బండారిలేవుట్‌కు చెందిన రవితేజ(28) ఐటీ ఉద్యోగం చేస్తున్నాడు.
మంగళవారం సాయంత్రం తన మేనల్లుడు రిషిరాజు(8)ని కారులో తిప్పడానికి మేడ్చల్ దాకా వెళ్లారు. తిరుగు ప్రయాణంలో మల్లంపేట్ ఎగ్జిట్‌ఫోర్ వద్ద దిగుతుండగా కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొని రెయిలింగ్‌ను తాకింది. ఈ ప్రమాదంలో రవితేజ గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. రిషిరాజును ఆసుపత్రికి తరలించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
పసిడి ప్రియులకు శుభవార్త.. తగ్గిన బంగారం ధరలు..
Read Latest Telangana News and National News