Share News

ముంబై ఫ్యామిలీ ట్రాజెడీ.. రాత్రి పూట పుచ్చకాయ తినవచ్చా?

ABN , Publish Date - Apr 29 , 2026 | 07:12 AM

ముంబైలో ఒకే కుటుంబానికి చెందిన నలుగు వ్యక్తులు పుచ్చకాయ తిన్న తర్వాత అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. రాత్రి పూట పుచ్చకాయ తినటం వల్లే ఆ నలుగురు ఫుడ్ పాయిజన్‌కు గురై చనిపోయారన్న ప్రచారం జరుగుతోంది. రాత్రిపూట పుచ్చకాయ తింటే ప్రాణాలకు ప్రమాదమా?.. డాక్టర్లు ఏం చెబుతున్నారు..

ముంబై ఫ్యామిలీ ట్రాజెడీ.. రాత్రి పూట పుచ్చకాయ తినవచ్చా?
watermelon at night

ఇంటర్‌నెట్ డెస్క్: ముంబైలోని పైధోనీ ఏరియాలో ఒకే కుటుంబానికి చెందిన నలుగు వ్యక్తులు పుచ్చకాయ తిన్న తర్వాత అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. గత శనివారం 10 గంటల సమయంలో 40 ఏళ్ల అబ్దుల్లా దొకాడియా అతడి భార్య 35 ఏళ్ల నస్‌రీన్‌, ఇద్దరు కూతుళ్లు 16 ఏళ్ల అయేషా, 13 ఏళ్ల జైనాబ్ బిర్యానీ తిన్నారు. రెండు గంటల తర్వాత పుచ్చకాయ తిని నిద్రపోయారు. కొద్దిసేపటి తర్వాత నలుగురు అనారోగ్యానికి గురయ్యారు. ఇంట్లో ఇద్దరు.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మిగిలిన ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.


రాత్రి పూట పుచ్చకాయ తినవచ్చా?..

ఆ నలుగురు ఎలా చనిపోయారో ధ్రువీకరించుకోవడానికి పోలీసులు మెడికల్, ఫోరెన్సిక్ రిపోర్టుల కోసం ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో రాత్రి పూట పుచ్చకాయ తినటం వల్లే నలుగురు ఫుడ్ పాయిజన్‌కు గురై చనిపోయారన్న ప్రచారం జరుగుతోంది. రాత్రిపూట పుచ్చకాయ తింటే ప్రాణాలకు ప్రమాదమా?.. డాక్టర్లు ఏం చెబుతున్నారు..


ప్రముఖ న్యూట్రిషనిస్టు డాక్టర్ శిల్పా అరోరా మాట్లాడుతూ.. ‘పుచ్చకాయలో 94 శాతం నీళ్లు, లైకోపెన్, పోటాషియంతో పాటు చాలా రకాల పోషకాలు ఉంటాయి. ఫైబర్ కూడా చాలా ఉంటుంది. రాత్రి 7 గంటల తర్వాత పండ్లు తినటం మంచిది కాదు. రాత్రి వేళల్లో అరుగుదల తక్కువగా ఉంటుంది. అలాంటి సమయంలో ఎసిడిక్ గుణం కలిగిన పుచ్చకాయ తినటం మంచిది కాదు. పుచ్చకాయను మధ్యాహ్నం 12 నుంచి 1 గంటల మధ్యలో తినాలి’ అని అన్నారు. ఆయుర్వేద నిపుణులు డాక్టర్ ధన్వంతరి త్యాగి మాట్లాడుతూ.. ‘అరుగుదల సమస్యలు ఉన్న వారు రాత్రి పూట పుచ్చకాయ తినకూడదు. నిద్రపోయే ముందు తింటే సమస్యలు తలెత్తే అవకాశం ఉంది’ అని అన్నారు.


ఇవి కూడా చదవండి

ఎస్‌ఎల్‌బీసీ మార్గంలో..4 చోట్ల డేంజర్‌ జోన్లు

ప్రియురాలిని చంపిన ప్రియుడు

Updated Date - Apr 29 , 2026 | 07:22 AM