Share News

పెట్రోల్‌ కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు

ABN , Publish Date - Apr 29 , 2026 | 07:10 AM

పెట్రోల్‌, డీజిల్‌ కృత్రిమ కొరత సృస్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ ప్రియాంక ఆల డిస్ర్టిబ్యూటర్లను హెచ్చరించారు.

పెట్రోల్‌ కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు
Collector Priyanka Ala

  • కలెక్టర్‌ ప్రియాంక ఆల

హైదరాబాద్‌ సిటీ: పెట్రోల్‌, డీజిల్‌ కృత్రిమ కొరత సృస్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ ప్రియాంక ఆల డిస్ర్టిబ్యూటర్లను హెచ్చరించారు. ఇంధనం కొరతపై వస్తున్న అసత్య ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దని సూచించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో మంగళవారం పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి ఎనర్జీ సప్లయ్‌ మానిటరింగ్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో పెట్రోల్‌, డీజిల్‌, ఎల్పీజీ లభ్యత, నిల్వలతోపాటు సరఫరా పరిస్థితులపై ఏజెన్సీ నిర్వాహకులు, డీలర్లతో కలెక్టర్‌ సమీక్షించారు.


అనంతరం ఆమె మాట్లాడుతూ వాటర్‌ సప్లయ్‌, అంబులెన్స్‌లతోపాటు ప్రభుత్వ వాహనాలకు ఇంధనం కొరత లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. చర్లపల్లి, ఘట్‏కేసర్‌ ఆయిల్‌ టెర్మినల్స్‌ నిర్వాహకులతో మాట్లాడి జిల్లాలో పెట్రోల్‌, డీజిల్‌ ఎక్కువగా అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.


city1.2.jpgగ్యాస్‌ సిలిండర్ల సరఫరా విషయంలో బుకింగ్‌, రీఫిల్లింగ్‌ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని, రెండు సిలిండర్ల కనెక్షన్‌ కలిగిన వినియోగదారులు డబుల్‌ బుకింగులు చేస్తే పరిశీలించాలన్నారు. సమావేశంలో జిల్లా చీఫ్‌ రేషనింగ్‌ ఆఫీసర్‌ రాజిరెడ్డి, జిల్లా సివిల్‌ సప్లయీస్‌ అధికారి శ్రీనివాస్‌, వివిధ శాఖల సంక్షేమ అధికారులు ఆశన్న, ప్రవీణ్‌కుమార్‌, ఇలియాస్‌ అహ్మద్‌, ఆర్టీఓ పురుషోత్తమరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

పసిడి ప్రియులకు శుభవార్త.. తగ్గిన బంగారం ధరలు..

మే 9న పాస్‌పోర్టు మేళా

Read Latest Telangana News and National News

Updated Date - Apr 29 , 2026 | 07:10 AM