మే 9న పాస్‌పోర్టు మేళా
ABN , Publish Date - Apr 29 , 2026 | 06:23 AM
తెలంగాణలో పెరుగుతున్న పాస్‌పోర్ట్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని మే 9న ‘పాస్‌పోర్టు మేళా’ నిర్వహించాలని హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం (ఆర్పీవో) నిర్ణయించింది.
ఐదు పాస్‌పోర్టు సేవా కేంద్రాల్లో 4వేల సాధారణ స్లాట్ల విడుదల
ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారిణి స్నేహజ వెల్లడి
హైదరాబాద్/సికింద్రాబాద్, ఏప్రిల్ 28 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో పెరుగుతున్న పాస్‌పోర్ట్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని మే 9న ‘పాస్‌పోర్టు మేళా’ నిర్వహించాలని హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం (ఆర్పీవో) నిర్ణయించింది. ఈ మేళాలో భాగంగా ఐదు పాస్‌పోర్ట్ ేసవా కేంద్రాల్లో కలిపి 4వేల సాధారణ స్లాట్లు విడుదల చేయనున్నారు. అదే సమయంలో ేసవల సామర్థ్యాన్ని పెంచే దిశగా కరీంనగర్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రంలో రోజువారీ స్లాట్ల సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతున్నారు. మే 4 నుంచి రోజుకు 220 స్లాట్ల నుంచి 400 వరకు పెంచనున్నారు. ఇందులో సాధారణ, తత్కాల్, పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ ేసవలు అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం సాధారణ స్లాట్ కోసం 8 నుంచి 10 పని రోజుల సమయం పడుతుండగా, ఈ ప్రత్యేక డ్రైవ్ ద్వారా వేచి చూేస సమయం తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారిణి స్నేహజ జొన్నలగడ్డ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 5 పీఎస్‌కేలు, 14 పోస్టాఫీస్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల ద్వారా రోజుకు సగటున 4,500 దరఖాస్తులను ప్రాసెస్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పాస్‌పోర్టు కార్యాలయం వరకు రాకుండా సమాచారం తెలుసుకునేందుకు 040-27715333, 040-27715115, 040-27806657 ఫోన్ నంబర్లు అందుబాటులో ఉంటాయన్నారు.