Share News

నమోదైన దొంగ ఓట్లను గుర్తించండి: కేటీఆర్‌

ABN , Publish Date - Apr 29 , 2026 | 06:53 AM

కాంగ్రెస్‌, బీజేపీలు ఇప్పటికే నమోదు చేయించిన డబుల్‌, దొంగ ఓట్లను గుర్తించి వాటిని తొలగించేలా పార్టీ శ్రేణులు కృషి చేయాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సూచించారు.

నమోదైన దొంగ ఓట్లను గుర్తించండి: కేటీఆర్‌

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 28 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌, బీజేపీలు ఇప్పటికే నమోదు చేయించిన డబుల్‌, దొంగ ఓట్లను గుర్తించి వాటిని తొలగించేలా పార్టీ శ్రేణులు కృషి చేయాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సూచించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణలో దొంగ ఓట్లు నమోదు కాకుండా ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో హైదరాబాద్‌ జిల్లా పార్టీ నేతలతో సమావేశమైన ఆయన.. ఎన్నికల సంఘం సర్‌ పేరిట చేపట్టనున్న ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంపై చర్చించారు. నగరంలో ఏ ఒక్క వ్యక్తి కూడా తన ఓటు హక్కును కోల్పోకుండా చూడాలని సూచించారు. కాగా, విద్యార్థి స్వచ్ఛంద సంస్థ స్ట్రీట్‌ కాజ్‌ సేవలు అభినందనీయమని కేటీఆర్‌ అన్నారు బంజారాహిల్స్‌లో నిర్వహించి న సదస్సులో ఆయన పాల్గొన్నారు. సంస్థ ఆవిర్భవించి 17 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా.. కేటీఆర్‌ రూ.17లక్షల విరాళాన్ని ప్రకటించారు. మరోవైపు.. సర్‌ కార్యక్రమంపై ముందుగా ప్రజల్లో విస్తృత ప్రచారంతో అవగాహన కల్పించాలని, బీఆర్‌ఎస్‌ నేతలు వినోద్‌కుమార్‌, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, తదితరులు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డిని కోరారు. మంగళవారం సీఈఓ కార్యాలయానికి వెళ్లి వినతిపత్రం సమర్పించారు.

Updated Date - Apr 29 , 2026 | 06:54 AM