ఉదయం Vs సాయంత్రం.. బరువు చూసుకోవడానికి ఏ సమయం మంచిది?
ABN , Publish Date - Apr 29 , 2026 | 08:03 AM
ఉదయం నిద్రలేచిన వెంటనే బరువు చూసుకోవడం మంచిదా? లేక సాయంత్రం సమయంలో కొలిస్తే కచ్చితమైన ఫలితాలు వస్తాయా? బరువు చూసుకోవడానికి ఏ సమయం సరైనదో తెలుసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్: ఈ రోజుల్లో చాలా మంది ఫిట్‌నెస్‌పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు. బరువు పెరిగినా లేదా తగ్గినా వెంటనే తెలుసుకోవాలని కోరుకుంటారు. అందుకే ఇంట్లోనే వెయింగ్ మెషిన్‌లు సాధారణమయ్యాయి. అయితే బరువును ఎప్పుడు చూసుకుంటే సరైన ఫలితం వస్తుంది? అనేది చాలా మందికి ఉన్న సందేహం.
నిపుణుల ప్రకారం, బరువు రోజంతా మారుతూ ఉంటుంది. మనం తినే ఆహారం, తాగే నీరు, నిద్ర, హార్మోన్ల మార్పుల కారణంగా బరువు కొంచెం కొంచెంగా మారుతుంది. అందుకే సరైన సమయాన్ని ఎంచుకోవడం చాలా ముఖ్యం.
ఉదయం..
ఉదయం నిద్రలేచిన వెంటనే, టాయిలెట్‌కు వెళ్లిన తర్వాత శరీరం తేలికగా ఉన్నప్పుడు, ఖాళీ కడుపుతో బరువు చూసుకుంటే సరైన రీడింగ్ వస్తుంది. ప్రతిరోజూ ఒకే సమయానికి, ఒకే విధమైన దుస్తులతో బరువు చూసుకోవడం వల్ల బరువులో వచ్చే మార్పులను సరిగ్గా అంచనా వేయవచ్చు.
సాయంత్రం..
సాయంత్రం బరువు చూసుకోవచ్చు, కానీ ఉదయం చూసుకోవడం అత్యంత ఖచ్చితమైన ఫలితాలను ఇస్తుంది. సాయంత్రం సమయంలో బరువు ఎక్కువగా కనిపించే అవకాశం ఉంటుంది. రోజంతా మనం తినే ఆహారం, తాగే నీరు వల్ల సాయంత్రానికి బరువు కొద్దిగా ఎక్కువగా (0.5 - 1 kg వరకు) ఉండవచ్చు.
బరువు సంఖ్యలపై ఎక్కువగా ఆందోళన పడకుండా, ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామంపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం. నిజమైన ఫిట్‌నెస్ అంటే కేవలం బరువు తగ్గడం కాదు, ఆరోగ్యంగా ఉండటమని నిపుణులు చెబుతున్నారు.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read:
మటన్ తినడం వల్ల నిజంగా యూరిక్ యాసిడ్ పెరుగుతుందా..
ఇంట్లో కుక్కలను పెంచడం వల్ల కలిగే ప్రయోజనాలు మీకు తెలుసా..
For More Latest News