Share News

టీడీపీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం

ABN , Publish Date - Apr 29 , 2026 | 11:03 AM

అమరావతిలో తెలుగుదేశం పార్టీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో పొలిట్ బ్యూరో, రాష్ట్ర, జాతీయ కమిటీల సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు.

టీడీపీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం
TDP New Committee 2026

అమరావతి: తెలుగుదేశం పార్టీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో పొలిట్ బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీల సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేష్ బాధ్యతలు స్వీకరించారు.

TDP (4).jpg

పార్టీ అధినాయకత్వం పాత, కొత్త నాయకుల కలయికతో కమిటీలను ఏర్పాటు చేయడం ప్రత్యేకతగా నిలిచింది. టీడీపీ చరిత్రలో తొలిసారిగా మండల, క్లస్టర్ స్థాయి నేతలకు కూడా పొలిట్ బ్యూరోలో చోటు కల్పించడం విశేషంగా మారింది. 'కార్యకర్తే అధినేత' అనే నినాదాన్ని నిజం చేస్తూ, కష్టపడి పని చేసిన నాయకులకు కమిటీల్లో ప్రాధాన్యం ఇచ్చారు.


TDP (2).jpg

44 ఏళ్ల పార్టీ చరిత్రలో కూడా కొత్త ఉత్సాహం కనిపించేలా టీడీపీ హైకమాండ్ కమిటీలను నియమించింది. సీనియర్ నాయకుల అనుభవాన్ని, జూనియర్ నాయకుల దూకుడును సమపాళ్లలో కలిపి కమిటీలను రూపొందించారు. ఈ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారంలో వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అలాగే మంగళగిరి క్లస్టర్ ఇన్ఛార్జ్ గుత్తికొండ ధనుంజయ్, గజపతినగరం మండల పార్టీ అధ్యక్షురాలు గంట్యాడ శ్రీదేవి కూడా హైలెట్‌గా నిలిచారు.

TDP (3).jpg


గతంలో సోషల్ మీడియాలో చురుకుగా పని చేసిన పలువురికి కూడా కొత్త కమిటీల్లో అవకాశం ఇవ్వడం గమనార్హం. ఎన్టీఆర్, చంద్రబాబు అధ్యక్షులుగా ఉన్న కాలంలోలాగే, ఈసారి కూడా సీనియర్ నేతలు యనమల రామకృష్ణుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి కీలక బాధ్యతల్లో కొనసాగుతున్నారు. ఈ కొత్త కార్యవర్గంతో టీడీపీకి మరింత బలం చేకూరుతుందని పార్టీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.


ఇవి కూడా చదవండి...

బెంగాల్‌లో తుది దశ పోలింగ్ ప్రారంభం.. ఆ నియోజకవర్గం పైనే అందరి దృష్టి..

బెంగళూరులో శ్రీహరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

Updated Date - Apr 29 , 2026 | 12:06 PM