ప్రత్యర్థి పార్టీ కుట్రలకు ఇక కాలం చెల్లింది: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Apr 29 , 2026 | 11:32 AM
అధికారంలో ఉండగా రాష్ట్రాన్ని నాశనం చేసింది చాలక.. ఇప్పుడు కూడా కుట్రలు చేస్తున్నారంటూ వైసీపీపై సీఎం చంద్రబాబు మండిపడ్డారు. కిల్లింగ్ మనస్తత్వంతో ఉన్న పార్టీకి సంక్షేమం పట్టదని.. అభివృద్ధి అంటే గిట్టదన్నారు.
అమరావతి, ఏప్రిల్ 29: వైసీపీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గొడ్డలి పార్టీ చేస్తున్న విధ్వంసాన్ని అనునిత్యం ప్రజలకు చెప్పాలని అన్నారు. కార్యవర్గం ప్రమాణస్వీకార కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. అధికారంలో ఉండగా రాష్ట్రాన్ని నాశనం చేసింది చాలక.. ఇప్పుడు కూడా కుట్రలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. కిల్లింగ్ మనస్తత్వంతో ఉన్న పార్టీకి సంక్షేమం పట్టదని.. అభివృద్ధి అంటే గిట్టదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిధులు తీసుకువస్తుంటే వాటిని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని.. అయినప్పటికీ ప్రభుత్వంపై విశ్వాసంతో రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు. ప్రత్యర్థి పార్టీ కుట్రలకు ఇక కాలం చెల్లిందన్నారు.
‘ఓసీడీ అనేది ఓ వ్యాధి.. గొడ్డలి పార్టీకి ఇప్పుడు సీసీడీ వ్యాధి సోకింది. క్రెడిట్ చోరీతో గొడ్డలి పార్టీ అనారోగ్యానికి గురైంది. వీళ్లని ఇలాగే వదిలేస్తే.. దేశానికి స్వాతంత్ర్యం కూడా తామే తెచ్చామని చెబుతారు. ఆపరేషన్ సిందూర్‌కు డ్రోన్లు కూడా ఇచ్చామని గొడ్డలి పార్టీ చెప్పేలా ఉంది. ఫేక్ ప్రచారంతో మనకే అనుమానం వచ్చేలా చేయడంలో గొడ్డలి పార్టీ ముందుంటుంది’ అంటూ సీఎం చంద్రబాబు వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ఇవి కూడా చదవండి..
ఆస్తి కోసం కూతురు ఎంతకు తెగించిందంటే..
ఏపీ పదో తరగతి ఫలితాలు రేపే.. ఉదయం 11 గంటలకు విడుదల
Read Latest AP News And Telugu News