Share News

రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేవారినే ప్రోత్సహిస్తా: చంద్రబాబు

ABN , Publish Date - Apr 29 , 2026 | 11:20 AM

బుధవారం తెలుగుదేశం పార్టీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో పొలిట్ బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీల సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు.

రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేవారినే ప్రోత్సహిస్తా: చంద్రబాబు
Chandrababu Naidu statement

అమరావతి, ఏప్రిల్ 29: తాను గుడ్డిగా ఎవరికీ బాధ్యతలు అప్పగించనని, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేవారినే ప్రోత్సహిస్తానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తేల్చి చెప్పారు. బలమైన కేడర్ కలిగిన ఏకైక పార్టీ టీడీపీ అని అన్నారు. దేశంలో టీడీపీలాగా క్రమశిక్షణ కలిగిన పార్టీ ఎక్కడా లేదని అభిప్రాయపడ్డారు. బుధవారం తెలుగుదేశం పార్టీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో పొలిట్ బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీల సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ..


‘కార్యకర్తే అధినేత అనే మన సిద్ధాంతాన్ని ఆచరణలో చూపిద్దాం. లోకేష్‌ పార్టీలో ప్రక్షాళన తెచ్చి కార్యకర్తలకు బీమా కల్పించారు. ప్రతి పోలింగ్ బూత్‌లోనూ మనం బలపడాలి. వచ్చే ఎన్నికల్లో 2024లో వచ్చిన ఓట్ల కంటే ఎక్కువ రావాలి. అన్ని సమీకరణలు చూసి కార్యవర్గాన్ని ఎంపిక చేశాం. సీనియారిటీ, సిన్సియారిటీ, కమిట్‌మెంట్ చూసి పదవులకు ఎంపిక చేశాం. 4 దశాబ్దాలుగా కమిటీలను నియమిస్తున్నాం. కానీ, ఇంతవరకు ఎప్పుడూ ఇంత కసరత్తు చేయలేదు. సీనియర్లను గౌరవిస్తూ కొత్తవారికి అవకాశం ఇచ్చాం. ఒక మండల పార్టీ నేతను పొలిట్ బ్యూరో మెంబర్‌ను చేశాం. సామాన్య కార్యకర్తలకు పార్టీలో పదవులొచ్చాయి’ అని అన్నారు.


ఇవి కూడా చదవండి

ఈవీఎంలో లోపం కారణంగా ఉద్రిక్తతలు.. ఇద్దరిని అదుపులోకి తీసుకున్న సీఆర్పీఎఫ్

టీడీపీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం

Updated Date - Apr 29 , 2026 | 11:28 AM